Online Gaming: ఆన్ లైన్ గేమింగ్ పై వస్తు, సేవల పన్ను(GST)ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. పలు కంపెనీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. మరోసారి పునరాలోచించాలని వినతులు సైతం కేంద్రానికి సమర్పించాయి. అయితే మోదీ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.
ఇందుకు సంబంధించి GST చట్టాల్లో సవరణలకు లోక్ సభ 2 నెలల క్రితం ఆమోదమూద్ర వేసింది. కాగా పెంచిన GST మరో 2 రోజుల్లో అమల్లోకి రానుంది. అక్టోబరు 1 నుంచి ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం GST విధించనున్నట్లు సెంట్రిల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఛైర్ పర్సన్ సంజయ్ అగర్వాల్ ప్రకటించారు.

'అన్ని రాష్ట్రాల సమ్మతితో అక్టోబర్ 1 నుంచి పెరిగిన GST వసూలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్ పాస్ చేయాల్సి ఉంది. కొన్ని ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి రావచ్చు. ఇది లీగల్ ప్రోసెస్' అని అగర్వాల్ తెలిపారు.
GST చట్టానికి చేసిన ఈ మార్పుల వల్ల క్యాసినో, గుర్రపు పందాలు, ఆన్ లైన్ గేమింగ్ పై పన్ను విధానంపై పూర్తి క్లారిటీ తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. కాగా తాజాగా పెంచిన GSTపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో రివ్యూ చేయనున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications