టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా కొత్త కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తున్నాయి. ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ కస్టమర్లు వీటి బారిన పడుతూనే ఉన్నారు. అయితే వీటికి సంబంధించి గతంలో ఎన్ని రిపోర్ట్స్ వచ్చిన సైబర్ నేరాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా దీనికి సంబంధించి ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రముఖ బ్యాంకుల కస్టమర్లే టార్గెట్ చేసుకుని ఫిషింగ్ దాడులు పెరుగుతున్నాయని Zscaler ThreatLabz రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రిపోర్ట్ దేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ ముప్పును అలాగే బ్యాంకులు, కస్టమర్లను మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది.
Zscaler ThreatLabz రిపోర్ట్ భారతీయ కస్టమర్లే లక్ష్యంగా చేసుకుని మొబైల్ మాల్వేర్ దాడులు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఫిషింగ్ దాడి అనేది హ్యాక్ చేసేవారు ఉపయోగించే ఒక విధమైన ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా అసలైన బ్యాంక్ వెబ్‌సైట్‌లగా ఉండే నకిలీ వెబ్‌సైట్‌లు లేదా ఇమెయిల్ క్రియేట్ చేస్తుంటారు. మీరు గుర్తుపట్టలేని విధంగా కస్టమర్ల లాగిన్ వివరాలు, అకౌంట్ వివరాలు వంటి పర్సనల్ సమాచారాన్ని ఎంటర్ చేయమంటూ మోసం చేస్తుంటాయి, ఆ తరువాత హ్యాక్ చేసి డబ్బు కాజేస్తుంటారు.

ఈ బ్యాంకులు ఎందుకు?
ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఆక్సిస్ బ్యాంక్ భారతదేశంలోని కొన్ని అతిపెద్ద బ్యాంకులు. ఇవి సైబర్ నేరగాళ్లకు ప్రముఖ లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్ల డేటా బేస్ ఉండటంతో ఈ బ్యాంకులపై ఫిషింగ్ దాడి చేసే ప్రయత్నాలు హ్యాకర్లకి వర్క్ అవుట్ అవుతుంది కాబట్టి. బ్యాంక్ కస్టమర్‌లు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.
ఈ టిప్స్ పాటిస్తే చాలు:
*అనవసరమైన ఇమెయిల్‌లు లేదా ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండండి: అనుమానిత లింక్‌లు
పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
*వెబ్‌సైట్ అడ్రస్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి: ఏదైనా లాగిన్ వివరాలు ఎంటర్ చేయడానికి ముందు మీరు నిజమైన బ్యాంక్ వెబ్‌సైట్ అవునా కాదా ఖచ్చితం చేసుకోండి.
*నిజమైన అఫరులాగ అనిపించే ఆఫర్స్ పట్ల జాగ్రత్త వహించండి: ఫిషింగ్ ప్రయత్నాలు మీరు ఉహించని ఆఫర్స్ లేదా ఎమర్జెన్సీ అలర్ట్స్ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తాయి.
*ఫ్రీ లేదా పబ్లిక్ Wi-Fi వాడుతున్నప్పుడు పర్సనల్ సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు: మని ట్రాన్స్ఫర్ కోసం సేఫ్ నెట్‌వర్క్‌ను మాత్రమే ఉపయోగించండి.
టు-స్టెప్స్ అతేంటికేషన్ ఎనేబుల్ చేయండి : దీని ద్వారా మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ కి మరింత సెక్యూరిటీ అందిస్తుంది. అయితే సైబర్ దాడుల పద్ధతుల వివరాలు తెలియనప్పటికీ HDFC వంటి బ్యాంకులు ఈ రిపోర్ట్ని అంగీకరించాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications