Income Tax News: ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ తతంగం పూర్తి చేశామని ధీమాగా ఉన్న ట్యాక్స్ పేయర్స్ ఇంకో విషయాన్ని కంప్లీట్ చేయాలని IT శాఖ వెల్లడించింది. దీనిని పూర్తి చేయని వారికి జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
IT రిటర్న్స్ ఫైలింగ్ అనంతరం ఇ-ధ్రువీకరణ సైతం పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. లేనిపక్షంలో అదికాస్తా అసంపూర్తిగా పరిగణించబడుతుంది అని గుర్తుచేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని కోరింది.

రిటర్న్స్ ఫైలింగ్ చేసిన 30 రోజుల్లోపు ITRను ధ్రువీకరించాలని ఇన్ కం ట్యాక్స్ శాఖ తెలిపింది. ఆగస్టు 2023 నుంచి ITRలు చెల్లుబాటు కావడానికి ఇ-వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు ట్వీట్ చేసింది. ఇందుకోసం ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి, 'ఇ-వెరిఫై రిటర్న్'పై క్లిక్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
పాన్ నంబర్, అసెస్మెంట్ సంవత్సరం, రసీదు నంబర్ ఎంటర్ చేసి సైట్ లో లాగిన్ కావచ్చు. ప్రత్యామ్నాయంగా పాన్, పాస్ వర్డ్ ఉపయోగించవచ్చు. అనంతరం మై అకౌండ్ ట్యాబ్ లోని 'ఇ-వెరిఫై రిటర్న్'ను క్లిక్ చేయాలి. అప్పుడు ధ్రువీకరణ పెండింగ్ ఉన్న ఫైల్ ను సైట్ చూపిస్తుంది. ఆధార్ కు లింక్ కాబడిన మొబైల్ నంబర్ కు వచ్చిన oTP ఎంటర్ చేస్తే సరి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications