New rules: కొత్త ట్యాక్స్ విధానంలో భారీ మార్పులు.. రూ. 4 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ! ఎలాగో చూడండి!
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, పన్ను నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. 2026-27 అస్సెస్మెంట్ ఇయర్ (AY) కి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది. మీరు సామాన్యులైనా, ఉద్యోగులైనా లేదా వ్యాపారస్తులైనా ఈ కొత్త రూల్స్ (New rules) గురించి తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే అనవసరమైన నోటీసులు, పెనాల్టీల బారిన పడే అవకాశం ఉంది.

ఎంత ఆదాయం వరకు పన్ను కట్టక్కర్లేదు?
పన్ను మినహాయింపు పరిమితులు (Exemption Limits) మీరు ఎంచుకున్న విధానం (Regime) పై ఆధారపడి ఉంటాయి..
- కొత్త పన్ను విధానం (New Tax Regime): ఇందులో ఎగ్జెంప్షన్ లిమిట్‌ను రూ. 4 లక్షలకు పెంచారు. అంటే మీ వార్షిక ఆదాయం రూ. 4 లక్షల లోపు ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
- పాత పన్ను విధానం (Old Tax Regime): సాధారణ వ్యక్తులకు రూ. 2.5 లక్షలు, 60 ఏళ్ల పైబడిన వారికి రూ. 3 లక్షలు, 80 ఏళ్ల పైబడిన వారికి రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఉంది.
స్టాండర్డ్ డిడక్షన్, ఇతర తగ్గింపులు
ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రభుత్వం సవరించింది.
- కొత్త విధానం: దీని కింద రూ. 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు.
- పాత విధానం: ఇందులో రూ. 50,000 పరిమితి కొనసాగుతోంది.
ఇవే కాకుండా పాత విధానంలో 80C కింద (PPF, LIC, ట్యూషన్ ఫీజులు) రూ. 1.5 లక్షల వరకు, NPS లో అదనంగా రూ. 50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు డిపాజిట్లపై వచ్చే వడ్డీపై 80TTB కింద రూ. 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
PAN కార్డు ఎక్కడ తప్పనిసరి?
ఆర్థిక పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త రూల్స్ (New rules) ను మరింత కఠినతరం చేసింది. కింది లావాదేవీలకు PAN నంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది..
- రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు లేదా విక్రయం.
- హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులు రూ. 50,000 దాటినప్పుడు.
- రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు.
- విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు.
TDS, పెనాల్టీలు జాగ్రత్త!
పన్ను నిబంధనలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
- TDS: బ్యాంకు వడ్డీ రూ. 50,000 (సీనియర్ సిటిజన్లు) దాటినా, ఆస్తి కొనుగోలు రూ. 50 లక్షలు దాటినా TDS వర్తిస్తుంది.
- పెనాల్టీలు: PAN లేదా ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రూ. 10,000 జరిమానా పడుతుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే రూ. 25,000 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ రూ. 25 లక్షల కంటే ఎక్కువ పన్ను ఎగవేతకు పాల్పడితే 6 నెలల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు నగదు లావాదేవీలపై పరిమితులు ఉన్నాయని గుర్తుంచుకోండి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిమితి రూ. 25 లక్షలుగా ఉంది. కాబట్టి పన్ను నిబంధనలను తప్పకుండా పాటిస్తూ, గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications