రూ. 1.14 కోట్ల పన్ను చెల్లిస్తే... రూ. 10 రీఫండ్.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్ అవుతున్న సీఏ సరదా పోస్ట్..

రూ. 1.14 కోట్ల మేర భారీగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన ఒక పన్ను చెల్లింపుదారుడికి లభించిన రీఫండ్ ఎంతో తెలుసా? అక్షరాలా పది రూపాయలు! చార్టర్డ్ అకౌంటెంట్ సుమిత్ శర్మ తన X (ట్విట్టర్) హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ ఆదాయపు పన్ను లెక్కింపు స్క్రీన్‌షాట్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. నాకు భారీ రీఫండ్ వచ్చింది అంటూ ఆయన సరదాగా పెట్టిన పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. సదరు పన్ను చెల్లింపుదారుడి మొత్తం వార్షిక ఆదాయం రూ. 3.07 కోట్లు కాగా.. చెల్లించాల్సిన నికర పన్ను రూ. 1,14,52,835గా తేలింది. దీనికి రూ. 15,751 వడ్డీ, ఫీజులు కలపగా మొత్తం చెల్లింపు రూ. 1,14,68,586కి చేరింది. అయితే పన్ను చెల్లింపుదారుడు పొరపాటున లేదా రౌండ్ ఆఫ్ కారణంగా రూ. 1,14,68,591 చెల్లించారు. అంటే సరిగ్గా రూ. 5 నుండి రూ. 10 అదనంగా చెల్లించడంతో సాంకేతికంగా రూ. 10 రీఫండ్ రావాల్సి వచ్చింది.

Income Tax Refund Income Tax Return ITR Refund CA Viral Post Chartered Accountant Income Tax News Tax Refund Income Tax Department Viral News Personal Finance Tax Filing ITR 2026 Finance News India News Business News ITR CA ITR 2026

అయితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం రూ. 100 కంటే తక్కువ ఉన్న రీఫండ్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయరు. కాబట్టి ఆ రూ. 10 రీఫండ్ ప్రాసెస్ అవ్వదని.. తుది స్క్రీన్‌షాట్‌లో రీఫండ్ మొత్తం 'సున్నా'గానే చూపిస్తుందని సీఏ శర్మ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ప్రాసెస్ అయిన ఈ సమ్మరీ.. సోషల్ మీడియాలో వినోదాత్మక చర్చకు దారితీసింది.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఇతర పన్ను నిపుణులు రకరకాల వినోదాత్మక వ్యాఖ్యలతో స్పందించారు. ఒక యూజర్ స్పందిస్తూ రూ. 1.14 కోట్లు పన్ను కడితే ఐటీ శాఖ నుంచి కనీసం ఒక రూ. 10 టీ ఆఫర్ వచ్చిందన్నమాట అని చమత్కరించగా.. నిఖిల్ సాహ్నీ అనే యూజర్ ఈ రూ. 10 ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి ఆర్టీఐ పిటిషన్ వేయాలి. రీఫండ్ చిన్నదే కావచ్చు కానీ, మన పన్ను డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవడమే పెద్ద ప్రశ్న అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read

ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు - ఐటీ శాఖ సూచనలు:
ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. సాధారణ పన్ను చెల్లింపుదారులు, జీతభత్యాలు పొందే ఉద్యోగులు, ఆడిట్ అవసరం లేని వ్యాపారులకు ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) సమర్పణకు జూలై 31 ఆఖరు తేదీగా ముగిసింది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయని వారు డిసెంబర్ 31 వరకు ఆలస్య రుసుముతో (Belated ITR) దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అదే సమయంలో, ఆడిట్ అవసరమైన వ్యాపారాలు, కార్పొరేట్ సంస్థలు, ట్యాక్స్ ఆడిట్‌కు పరిధిలోకి వచ్చే వ్యక్తిగత ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి అక్టోబర్ 3 తుది గడువుగా ఉంది. కాబట్టి ఆడిట్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు నిరీక్షించకుండా.. సకాలంలో తమ ఐటీఆర్ సబ్మిట్ చేసి వడ్డీలు, జరిమానాలు, చివరి నిమిషం సాంకేతిక ఇబ్బందుల నుండి తప్పించుకోవాలని ఆదాయపు పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+