హైదరాబాద్ లో ఆదిత్య అనే ఓ ఉద్యోగి.. తన ఉద్యోగంలో అలసిపోయిన కారణంగా విదేశాలకు టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అమెరికాలో రెండు వారాల పాటు ఆనందంగా గడపాలని కోరుకున్నాడు. ఇందుకోసం అతను ముందు నుంచే డబ్బును ఆదా చేసుకున్నాడు. బిజినెస్ క్లాస్ విమానాలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో వసతితో ట్రిప్ ఆనందంగా ముగించాడు. ఇక మ్యూచువల్ ఫండ్లలో lumpsum పెట్టుబడులు పెట్టి డబ్బును మరింతగా ఆదా చేసుకున్నాడు. అతని మొత్తం ఖర్చు రూ. 13 లక్షలకు పైగానే పెరిగింది. అయితే అతను ఫారిన్ ట్రిప్ ముగిసి ఇంటికి రాగానే ఐటీ నోటీసు అతని తలుపు తట్టింది.
విజయవాడకు చెందిన విజయ్ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి జీతం నెలకు రూ.55,000.. సాధారణ జీవితం గడుపుతున్న అతడు ఇటీవల అకస్మాత్తుగా ఆదాయపు పన్నుశాఖ (Income Tax Department) నుంచి నోటీసు అందుకుని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. నా జీతం ఐటీఆర్ దాఖలు చేసే అంత కాదు.. అయినా నాకు నోటీసు రావడమేంటని ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. అయితే అతగు చేసిన కొన్ని ఆర్థిక లావాదేవీలు ఈ నోటీసులకు కారణమయ్యాయి. దీనిపై ఇన్ కం ట్యాక్స్ నిపుణులు CA నితిన్ కౌశిక్ పలు సూచలను చేస్తున్నారు. ఆదాయపు శాఖ కొన్ని ఆర్థిక పరిమితుల్ని దాటితే ఆటోమేటిక్‌గా వాటిని గుర్తించి.. సంబంధిత లావాదేవీలపై మిమ్మల్ని ప్రశ్నించగలదని చెబుతున్నారు.

మీరు చేసే లావాదేవీల్లో పన్ను శాఖ పసిగట్టే వివరాలు ఇవే..
పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్: రూ. 10 లక్షలు కన్నా ఎక్కువ / ఏడాదికి
కరెంట్ అకౌంట్ డిపాజిట్: రూ. 50 లక్షలు దాటితే..
నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: రూ. 1 లక్ష దాటితే..
మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు (ఏ రూపంలోనైనా): రూ. 10 లక్షలు దాటితే..
స్థిరాస్తి కొనుగోలు/అమ్మకం: రూ. 30 లక్షల స్టాంప్ విలువ ఉంటే..
FD, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు: రూ. 10 లక్షలు దాటితే..
విదేశీ ప్రయాణ ఖర్చులు/ఫారెక్స్ కొనుగోలు: రూ. 10 లక్షలు దాటితే..
బంధువులు కాని వారి నుండి పొందిన నగదు బహుమతులు: రూ. 50,000 దాటితే..
ఒకే రోజులో ఏ వ్యక్తి నుండి నగదు స్వీకరణ: రూ. 2 లక్షలు దాటితే..
నోటీసు వచ్చినపుడు ఏం చేయాలంటే..
భయపడకుండా IT పోర్టల్‌లో DIN నంబర్‌తో ధృవీకరించండి.
ఏ సెక్షన్ కింద నోటీసు వచ్చిందో తెలుసుకోండి.. ఉదాహరణకి 143(1), 148 మొదలైనవి.
బ్యాంక్ స్టేట్మెంట్లు, పెట్టుబడి రుజువులు, ఫారం 16 వంటివి సేకరించండి.
వాస్తవాలను ఆధారంగా తీసుకుని సమాధానాన్ని సమర్పించండి.
అయినా సమస్య పరిష్కారం కాకపోతే, అప్పీల్ చేసే హక్కులు మీకు ఉన్నాయి. సెక్షన్ 154 సవరణ, సెక్షన్ 264 ప్రకారం మీరు అప్పీల్ చేసుకోవచ్చు.మీ ఆదాయం ఎంత ఉన్నా సంబంధం లేదు. మీరు కొన్ని పరిమితులను దాటితే, బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వీటిని ఐటీకి రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. మీరు సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేస్తే వెంటనే ఐటీకి తేలిసిపోతుంది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి ఉంటే బ్యాంకులు CBITDకి రిపోర్ట్ చేస్తాయి.
అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు నగదు రూపంలో రూ.1 లక్ష మించితే ఐటీకి తెలిసిపోతుంది. ఏ రూపమైనా బిల్లు చెల్లింపు రూ.10 లక్షలు మించితే ఐటీ పసిగడుతుంది. అలాగే ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకం రూ.30 లక్షలకంటే ఎక్కువైతే అది కూడా రిపోర్ట్ చేయాల్సిందే. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెడితే ఐటీకి చిక్కిపోతారు. విదేశీ ప్రయాణానికి రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే ఐటీ శాఖ మీరు ఎంత సంపాదిస్తున్నారో గమనించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మీరు సకాలంలో ITR దాఖలు చేయాలి. మీ ఆదాయం ఎంతైతే అందులో మీరు చేసిన పెట్టుబడులు, ఖర్చుల మధ్య సమతుల్యత ఉండాలి. 26AS, AIS స్టేట్‌మెంట్‌లను చెక్ చేసి, వాటి ఆధారంగా ITR దాఖలు చేయాలి.కాబట్టి తెలియక తప్పు చేయకుండా.. ముందే తెలుసుకుని జాగ్రత్తపడండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications