Income Tax: పన్నుల వసూళ్లు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కఠిన వైఖరిని అనుసరిస్తోంది. ఆదాయపు పన్ను విభాగం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ట్యాక్స్ వసూళ్లు భారీగా పెరిగాయి.
గత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(HNI) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు IT విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు మరియు అసెస్‌మెంట్ కోసం ఆదాయ వనరులను డిపార్ట్‌మెంట్ ట్రాక్ చేస్తోందని వెల్లడించారు.
'FY23లో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లలో 1 కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే పలు మార్గాల్లో సంగ్రహించిన డేటా ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండాలి. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపుతాం' అని ఆ అధికారి స్పష్టం చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications