ఆంధ్రాలో భారీగా పెరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్.. దేశంలో AP టాప్ ప్లేస్.. మరి తెలంగాణ స్థానం?
Income Tax: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వేతన జీవుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అంటే దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల సంపాదనా సామర్థ్యం వృద్ధి చెందుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
2015-20 మధ్య దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.8 కోట్లకు పైగా పెరిగింది. అయితే గత మూడేళ్లలో కేవలం కోటి మంది టాక్స్ పేయర్స్ మాత్రమే పెరిగారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా పరిస్థితి నెలకొన్నప్పటికీ, కొంత విభిన్నంగా ఉంది. అదే ఐదేళ్లలో కేవలం 5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరగ్గా.. గత 8 ఏళ్లుగా చూస్తే 23 లక్షల మంది కొత్తగా యాడ్ అయినట్లు SBI నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా పెరిగిన ఈ టాక్స్ పేయర్ల సంఖ్య కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కువగా పెరిగినట్లు SBI పరిశోధన తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
2014లో ఇక దేశవ్యాప్తంగా ప్రజల సగటు ఆదాయం 4.4 లక్షలు ఉండగా.. 2023 నాటికి 13 లక్షలకు చేరినట్లు నివేదిక పేర్కొంది. 2047 నాటికి ఈ సంఖ్య కాస్త దాదాపు 50 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 31.3 కోట్ల మంది IT పరిధిలోకి రాగా.. రాబోయే 14 ఏళ్లలో 56.5 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. 2015తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 5 కోట్ల మంది ఎక్కువగా రిటర్న్ దాఖలు చేసినట్లు నివేదించింది.


Click it and Unblock the Notifications