IT Raids: దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న మాన్‌కైండ్ ఫార్మా కార్యాలయాలపై ఆదాయపుపన్ను అధికారులు దాడులు చేపట్టారు. ప్రముఖ వార్త సంస్థలో వచ్చిన కథనాల ప్రకారం ఐటీ శాఖ దిల్లీలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈవారం మార్కెట్లోకి ఐపీవోగా వచ్చి విజయవంతంగా స్టాక్ లిస్ట్ జరిగిన తర్వాత తాజా చర్యలు వచ్చాయి.
అయితే కంపెనీ కార్యాలయాలపై ఐటీ రెయిడ్స్ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు దాదాపు 5.5 శాతం మేర పతనమయ్యాయి. అయితే దీనిపై అటు ఐటీ అధికారుల నుంచి కానీ ఇటు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టట లేదు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం మ్యాన్‌కైండ్ ఫార్మా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ దిల్లీలోని కంపెనీ ప్రాంగణాలు, సమీపంలోని ప్రదేశాలను శోధిస్తోంది. కంపెనీకి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తోంది. ఈ క్రమంలో కొందరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడైంది.
చాలా కాలం తర్వాత ఫార్మా రంగానికి చెందిన అతిపెద్ద ఐపీవోను కంపెనీ ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌ల తయారీ సంస్థ షేర్లు పబ్లిక్ లిస్టింగ్‌లో దాదాపు 32 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ లాభాలను అందించింది. ఈ రోజు ఉదయం 10.50 గంటల సమయంలో స్టాక్ స్వల్ప నష్టాలతో రూ.1351.95 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications