IT Raids: ఇటీవలి కాలంలో అనేక చైనా సంస్థలపై భారతదేశంలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నింటిలో పన్ను అవకతవకలను వారు గుర్తించారు.
చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హైయర్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు నిర్వహించింది. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, నోయిడా, పూణేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కంపెనీకి చెందిన ప్రాంగణాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. కంపెనీ పెద్ద ఎత్తువ పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు అనుమానాల నేపథ్యంలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ఆర్థిక రికార్డులు, లావాదేవీలు కొనసాగుతున్నాయా లేదా అనే దానిపై పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముంబై, పూణె రెండు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఇతర ప్రాంగణాల్లో సైతం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ దాడులపై ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
గృహోపకరణాల మార్కెట్లో దేశంలో మంచి గుర్తింపును పొందిన హయర్ ఇండియా చైనాకు చెందిన సంస్థ. ఇది ప్రపంచ వ్యాప్తంగా 14 ఏళ్లుగా నెం-1 బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలో Haier ఇండియా కోల్డ్ చైన్ సొల్యూషన్స్, మెడికల్ ఫ్రీజర్స్, కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ వంటి అనుబంధ విభాగాలను కూడా పరిశీలిస్తోంది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌పై కూడా భారీగా పెట్టుబడి పెడుతోంది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఏప్రిల్ 2023లో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications