IT Raid: ట్రైడెంట్ గ్రూప్‌పై ఇన్కమ్ టాక్స్ శాఖ దాడులు.. పూర్తి వివరాలు..
Trident Group: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. కంపెనీలను నడిపించటంలో జరుగుతున్న తప్పులను వారు గుర్తిస్తున్నారు.
నేడు ట్రైడెంట్ గ్రూప్ వ్యాపార ప్రాంతాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన దాడులు జరుగుతున్నాయి. ట్రైడెంట్ గ్రూప్ నూలు, హోమ్ టెక్స్‌టైల్, పేపర్ & స్టేషనరీ, కెమికల్స్ & అడాప్టివ్ పవర్ రంగాల్లో తన వ్యాపారాలను కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీకి బుధ్ని, మధ్యప్రదేశ్, బర్నాలా, ధౌలా, పంజాబ్‌లలో తయారీ సౌకర్యాలు ఉన్నాయి.

సెహోర్ జిల్లా బుద్నిలో ట్రైడెంట్ కంపెనీపై మంగళవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. విచారణ కోసం కంపెనీ క్యాంపస్‌ను సీజ్ చేశారు. దాదాపు 60 వాహనాల్లో 40 మంది ఐటీ అధికారుల బృందం సోదాలు చేపట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు కోసం బృందం కంపెనీ పత్రాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ట్రైడెంట్ కంపెనీలో తయారయ్యే 75% ఉత్పత్తులు(టవల్స్, బెడ్‌షీట్లు) విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తల నేపథ్యంలో ట్రైడెంట్ స్టాక్ ధర మార్కెట్లో ప్రభావితం అవుతోంది. ఉదయం 11.06 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 2.56 శాతం తగ్గి రూ.36.20 వద్ద కొనసాగుతోంది. అయితే దాడులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications