టాక్స్‌పేయర్లకు ఝలక్.. వాటి గురించి చెప్పండి.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!
బ్లాక్ మనీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ట్యాక్స్ పేయర్లు విదేశీ ఆదాయాలు, ఆస్తులు ఇతర సమాచారం గురించి వెల్లడించకపోతే భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇప్పుడు ఆదాయపు పన్ను అలాగే నల్లధనం చట్ట ఉల్లంఘనగా కూడా మారింది. కాబట్టి రెండు చట్టాల ప్రకారం విదేశీ ఆదాయం, ఆస్తులను సకాలంలో నివేదించకపోతే దానికి రెట్టింపు చట్టపరమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది.
చాలా మంది పన్ను చెల్లింపుదారులకి విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వెల్లడించాలి అనే దానిపై ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. ఈ సమస్యపై ఇంకా క్లారిటీ తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ 11 డిసెంబర్ 2024న ఒక బ్రోచర్‌ను కూడా విడుదల చేసింది, ఇందులో పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లో 31 డిసెంబర్ లేదా అంతకు ముందు ఎలాంటి పన్ను చెల్లింపుదారులు విదేశీ ఆస్తులు (FA) ఫైల్ చేయాలి అనే కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి 31 డిసెంబర్ 2024లోగ దాఖలు చేయవచ్చు. గడువు తేదీకి ముందు అంటే 31 డిసెంబర్ 2024లోపు మీ రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు సరైన ITR ఫారమ్ సెలెక్ట్ చేసుకోండి. విదేశీ ఆదాయం, ఆస్తుల వివరాలను షెడ్యూల్ FA, షెడ్యూల్ FSI ఇంకా షెడ్యూల్ TRలో అందించండి. మీ ఆదాయాలు లేదా ఆస్తుల మొత్తం విలువ ఇరవై లక్షల రూపాయలు దాటితే రూ. 10 లక్షల జరిమానా విధించవచ్చు.
విదేశీ ఆస్తి అంటే ఏమిటి?
ఐటి డిపార్ట్‌మెంట్ అడ్వైజరీ ప్రకారం భారతీయుల విదేశీ ఆస్తులలో బ్యాంక్ అకౌంట్స్, క్యాష్ వాల్యూ ఇన్సూరెన్స్ కాంట్రాక్టు లేదా ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఫైనాన్సియల్ ఇంట్రెస్ట్, స్థిరాస్తి, కస్టోడియల్ అకౌంట్, ఈక్విటీ అండ్ ట్రస్ట్‌లు ఇంత కొన్ని ఉంటాయి. మీ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు/ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్లధనం ఇంకా పన్ను చట్టం 2015 కింద రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు.


Click it and Unblock the Notifications