Tax Notice: ఆ యాప్ వాడేవారికి షాక్.. ఆదాయపు పన్ను అధికారుల నుంచి నోటీసులు, జాగ్రత్తయ్యా..
Digi Yatra: దేశంలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవటానికి ఉన్న ఎలాంటి మార్గాన్ని కూడా అధికారులు వదులుకోవటం లేదు. పైగా టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తూ దేశంలో ఆదాయపు పన్ను శాఖకు మస్కా కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిని పట్టుకునేందుకు ప్రస్తుతం పన్ను శాఖ కొత్త ఆలోచనలతో ముందుకొస్తోందని తెలుస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తరచుగా డిజీ యాత్ర యాప్ వినియోగిస్తున్న వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే వారికోసమే ఈ వార్త. అవును ప్రస్తుతం అధికారులు ఇందులోని డేటాను క్రోడీకరించటం ద్వారా పన్ను ఎగవేతదారులకు నోటీసులను పంపే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ప్రస్తుతం పన్ను శాఖ డిజీ యాత్ర యాప్ ఉపయోగిస్తున్న వారికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించిందని తెలుస్తోంది. దీనిని పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేసిన ఐటీఆర్ తో పోల్చి చూడటం ద్వారా ఆదాయాన్ని దాచిఉంచే వ్యక్తులను పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. వీటి ఆధారంగా 2025లో పన్ను శాఖ వ్యక్తులకు నోటీసులు పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

డిజీ యాత్ర యాప్ ఏంటి..?
వాస్తవానికి డిజీ యాత్ర యాప్ అనేది విమాన ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పేపర్‌లెస్‌గా చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నేతృత్వంలో తీసుకురాబడిన చొరవ. ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగించిన సంగతి తెలిసిందే. విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో ఆలస్యం లేకుండా సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రయాణీకుల ఐడీ, బయోమెట్రిక్ వివరాలు, విమాన టిక్కెట్ల వివరాలను ఇది సేకరిస్తుంది. అయితే ప్రయాణికులకు తప్పనిసరిగా దీనిని వినియోగించాలనే నియమం లేదు. వ్యక్తులు వారి అవసరానికి అనుగుణంగా దీనిని వినియోగించటం పూర్తిగా వారి వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతోంది.
డిజీ యాత్ర ద్వారా పొందే డేటా నమ్మదగినది, ధృవీకరించదగినది కావటం వల్ల అధికారులకు ఇది బలమైన ఆధారాలుగా నిలుస్తాయి. ఈ డేటాను పన్ను శాఖ డేటా బేస్ తో అనుసంధానించినప్పుడు.. రిటర్న్స్ ఫైల్ చేయనివారిని సమర్థవంతంగా గుర్తించగలదు. మొదట పన్ను శాఖ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారిని దీని ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలకు దిగుతుంది. ఆపై పన్నులు చెల్లించకుండా ఉండటానికి వారి ఆదాయాన్ని తక్కువగా నివేదించే వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. డిపార్ట్‌మెంట్ అంతర్జాతీయ, దేశీయ విమాన ప్రయాణికుల డేటాను డిజీ యాత్ర యాప్ డేటా ద్వారా పరిశీలిస్తోందని తెలుస్తోంది. దీని నుంచి గుర్తించిన వివరాల ఆదారంగా రానున్న కాలంలో పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు పన్ను అధికారులు లేదా పన్ను శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications