ITR Forms: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..!
Income Tax Returns: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావటంతో పన్ను చెల్లింపుదారుల్లో హడావిడి మెుదలైంది. పన్ను ఆదా ప్లాన్ నుంచి ఫైలింగ్ వరకు అనేక అనుమానాలతో ఉన్న వేళ పన్ను శాఖ పెద్ద ప్రకటన చేసింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ITR-1, ITR-2, ITR-4 పన్ను రిటర్న్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో సులభంగా పన్నులు చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ క్రమంలో రిటర్స్న్ ఫైల్ చేసేందుకు ఈ-ఫైలింగ్ పోర్టల్ 1 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు ITR ఫారమ్‌ని ఉపయోగించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైలింగ్ పూర్తి చేయవచ్చు. రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2024గా ఉంది.

ITR-1: జీతం, ఆస్తి, వడ్డీ, డివిడెండ్, పెన్షన్, వ్యవసాయం లేదా మరేదైనా మార్గం ద్వారా రూ.50,000 వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ITR-1 ఫారమ్‌ను నిర్థేశించబడింది. దీనికి తోడు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల ఆదాయం రూ.50 లక్షలకు మించకూడదు.
ITR-2: ఒకటి కంటే ఎక్కువ ఆస్తి లేదా ఏదైనా మూలధన లాభాల నుంచి ఆదాయాన్ని పొందే పన్ను చెల్లింపుదారులు ITR-2 ఫారమ్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ITR-4: సెక్షన్ 44AD, 44ADA లేదా 44AE కింద సంపాదిస్తున్న 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కంపెనీల కోసం ఈ ఫారమ్ ఉద్ధేశించబడింది. అయితే ఈ ఫారమ్ LLP కోసం మాత్రం కాదు.
ఆదాయపు పన్ను రిటర్న్ కోసం మొత్తం 6 రకాల ఫారమ్‌లు ఉన్నాయి. ఒకవేళ తప్పుడు ఫారమ్ పూర్తి చేసి రిటర్న్ ఫైల్ చేస్తే.. ఫారమ్ లోపభూయిష్టంగా ఉందని ఆదాయపు పన్ను శాఖ తిరస్కరిస్తుంది. అందువల్ల సరైన ఫారమ్ నింపటానికి ముందు వాటికి సంబంధించిన వివరాలను తప్పక టాక్స్ పేయర్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ITR ఫైల్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత స్క్రీన్‌పై కనిపించే 'ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులకు వార్షిక సమాచార ప్రకటన, ఫారం 26AS స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫైలింగ్ ముందు తప్పనిసరిగా ఫారం 16, ఫారం 16A, ఇతర TDS సర్టిఫికేట్, వడ్డీ సర్టిఫికేట్, పే స్లిప్‌ను రెండు-మూడు సార్లు చెక్ చేసుకోవాలి. అలా ఫైలింగ్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.


Click it and Unblock the Notifications