క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ పేమెంట్స్ చేస్తున్న వినియోగందారులపై ఇటీవల బడ్జెట్‌లో ప్రభుత్వం బాంబ్ పేల్చించిన విషయం తెలిసిందే. వీటి ద్వారా చేసే విదేశీ ఖర్చులపై భారీ మొత్తంలో పన్ను విధించడానికి ఆదాయపు పన్ను శాఖ సిద్ధమైంది. కొత్త నిబంధనలు సైతం ప్రవేశపెట్టే అవకాశమూ ఉంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర వాటాదారులతో IT విభాగం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కార్డు జారీచేసే సంస్థ వద్ద క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నిర్ణీత వ్యవధిలోగా డిక్లరేషన్‌ను ఫైల్ చేయాల్సిన విధంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. TCS(ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) విధింపు కోసం విదేశీ కరెన్సీలో చేసే ఖర్చులను కార్డ్ హోల్డర్ ఈ డిక్లరేషన్‌లో వెల్లడించాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఓ ప్రత్యేక మెకానిజంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర బ్యాంకుతో ఆదాయపు పన్ను శాఖ సమాలోచనలు చేస్తోంది. విద్య, వైద్యంపై చేసే ఖర్చులపై 5 శాతం మరియు ఇతరత్రా వాటిపై 20 శాతం వరకు TCS విధించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యత్నిస్తున్నట్లు
మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
కొత్త TCS నిబంధనలు జూలై 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా కార్డు జారీచేసే బ్యాంకుకు వినియోగదారులు డిక్లరేషన్ దాఖలు చేయడానికి కొంత అదనపు సమయం ఇవ్వాలన్న విషయంపైనా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం TCS పై IT శాఖ వివరణాత్మక FAQలను కూడా జారీ చేసే అవకాశం ఉంది.
యూనియన్ బడ్జెట్ 2023-24లో, విదేశీ టూర్ ప్యాకేజీలు మరియు సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద పంపే నిధులపై TCS రేట్లు 5 శాతం నుండి 20 శాతానికి పెంచారు. అంటే కొత్త నిబంధనల ప్రకారం.. 7 లక్షలకు మించిన క్రెడిట్ కార్డ్‌లపై చేసే విదేశీ ఖర్చుల మీద 20 శాతం TCS విధించబడుతుంది. విద్య లేదా వైద్య అవసరాల కోసం ఖర్చులు చేసినట్లయితే, అటువంటి వాటిపై 5 శాతం మాత్రమే TCS వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications