Fake HRA Claims: ప్రతి ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపుదారులు తామ పన్ను చెల్లింపులను తగ్గించుకునేందుకు ఉన్న వివిధ మార్గాలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది దుర్వినియోగం చేసేది హౌస్ రెంట్ అలవెన్స్. దీనిపై పన్ను అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ తప్పుడు క్లెయిమ్స్ అరికట్టేందుకు టెక్నాలజీ కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
అయితే ఇలా తప్పుడు ఇంటి అద్దె అలవెన్స్ క్రెయిమ్ చేసిన వారిపై కేసులు తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తా సంస్థల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇది పన్ను చెల్లింపుదారుల్లో పెద్ద ఆందోళనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) తన వివరణను ఇచ్చింది. ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని.. పెద్ద ఎత్తువ కేసులను పునఃప్రారంభించాలని తాము అనుకోవటం లేదని సోమవారం వెల్లడించింది. చాలా మంది పన్నుచెల్లింపుదారుల్లో వీటిపై అనేక భయాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

ఆదాయాలు, కార్పొరేట్ పన్నుల విషయాల్లో అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ తన నోటిఫికేషన్‌లో, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన సమాచారం సరిపోలని కొన్ని సందర్భాల్లో.. దాని సాధారణ డేటా వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా IT విభాగానికి అందుబాటులో ఉన్నందున చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఐటి డిపార్ట్‌మెంట్ పన్ను చెల్లింపుదారులను దిద్దుబాటు చర్యలు తీసుకునేలా అప్రమత్తం చేసిందని CBDT తన నోటీసులో వెల్లడించింది. ఈ విషయాలపై రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ గురించి ఏవైనా భయాలు, HRA క్లెయిమ్‌ల సమస్యలపై కేసులను తిరిగి తెరవడం పూర్తిగా నిరాధారమని ఆదాయపు పన్ను సంఘం తెలిపింది.
వాస్తవానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగి చెల్లించిన అద్దె తీసుకున్న వ్యక్తి చూపిన రసీదు మధ్య వెత్యాసం వచ్చినప్పుడు కొన్ని అధిక-విలువ సందర్భాల్లో మాత్రమే డేటా విశ్లేషణ నిర్వహించబడింది. అయితే వార్తల్లో ఇచ్చినట్లుగా ఇటువంటి కేసులను తిరిగి తెరవడానికి ప్రత్యేక డ్రైవ్ లేదని పన్ను శాఖ పేర్కొంది.


Click it and Unblock the Notifications