Income Tax: పన్ను చెల్లింపుదారులకు కొత్త సదుపాయం.. ఇకపై ఒక్క క్లిక్‌తోనే..

Tax Notices: మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియటంతో చాలా మంది తమ పన్ను రిటర్న్స్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో అనేక మార్లు టాక్స్ పేయర్స్ అధికారుల నుంచి నోటీసులు అందుకుంటుంటారు. వారికి ఈ విషయంలో మెరుగైన సౌలభ్యాన్ని అందించేందుకు ఆదాయపుపన్ను శాఖ కొత్త సేవతో ముందుకొచ్చింది.

పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ తన పోర్టల్‌లో కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఇకపై టాక్స్ పేయర్స్ ఒక్క క్లిక్‌తో పన్ను అధికారుల నుంచి తాము అందుకున్న అన్ని నోటీసుల వివరాలను ఒకే చోట ఇకపై పొందనున్నారు. కొత్త ఇ-ప్రొసీడింగ్ విభాగంలో ఈ సదుపాయం యాడ్ చేయబడింది. దీనికి సంబంధించి అనుమానాలను నివృత్తి చేసేందుకు పన్ను శాఖ FAQ జారీ చేసింది. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్‌లో శాఖ జారీ చేసిన అన్ని నోటీసులు, ఇన్‌టిమేషన్‌లు, ఇతర లేఖలను ఒకే చోట పన్ను చెల్లింపుదారులు ట్రాక్ చేయవచ్చు.

Income tax department brought facility to get all tax notices with single click

కొత్త సదుపాయంపై క్లిక్ చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు అన్ని నోటీసులు, పెండింగ్ పన్ను ప్రక్రియలను ట్రాక్ చేయవచ్చు. వాటికి ఆన్‌లైన్‌లోనే బదులివ్వొచ్చు. ఈ కొత్త సదుపాయంతో పన్ను చెల్లింపుదారులు ప్రతి పనికి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనప్పుడు లేదా వడ్డీ, అద్దె లేదా ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో సహా ఇతర లావాదేవీల గురించి సమాచారాన్ని బ్యాంకుకు అందించనప్పుడు, ఆదాయపు పన్నులోని వివిధ సెక్షన్‌ల కింద వివరణ కోరుతూ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ జారీ చేసింది.

కొత్త ట్యాబ్‌లో అందుబాటులో ఉండే సమాచారం ఇదే..
- సెక్షన్ 139(9) కింద లోపభూయిష్ట నోటీసు
- సెక్షన్ 245 కింద నోటిఫికేషన్‌లు
- సెక్షన్ 143(1)(ఎ) కింద ప్రాథమిక సర్దుబాటు
- సెక్షన్ 154 సుమో మోటో సంస్కరణ
- ఏదైనా ఇతర ఆదాయపు పన్ను అధికారి జారీ చేసిన నోటీసు
- వివరణ కోసం కోరిన సమాచారం

నోటీసులను పరిశీలించం ఇలా..
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ www.incometax.gov.inకి లాగిన్ అవ్వండి.
- డాష్‌బోర్డ్ నుంచి 'పెండింగ్ యాక్షన్' విభాగానికి వెళ్లి అక్కడ 'ఇ-ప్రొసీడింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఇక్కడ వాయిదా వేసిన పన్ను ప్రక్రియ, పంపిన నోటీసులకు లింక్‌లు కనిపిస్తాయి.
- నోటీసులకు బదులివ్వటానికి, వ్యక్తిగత లేదా అధీకృత ప్రతినిధి ఎంపికను ఎంచుకోవాలి.
- మీరు మీ స్వంతంగా సమాధానమిస్తుంటే అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇవ్వాల్సి ఉంటుంది
- అధీకృత ప్రతినిధులు పన్ను చెల్లింపుదారు తరపున అధికార లేఖను సమర్పించాలి.
- కొన్ని సందర్భాల్లో TAN నంబర్ కూడా అవసరం కావచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+