Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!
తెలుగు వెండి తెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి జీవితం నిజంగా అందరికీ ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. చిరు క్రమ శిక్షణతో సినీ ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదిగారు. ఆయన సేవ గుణంలో కూడా అందరిని మించి పోయారు. చిరంజీవి బ్లాడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఎంతో మందికి సాయం చేశారు. కరోనా సమయంలో సినీ కళాకారులను ఆదుకున్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాదు ఆర్థిక క్రమశిక్షణలో కూడా ముందున్నారు.
చిరుకు భారీగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికలు, వివిధ జాతీయ మీడియా కథనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఆస్తి విలువ 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇది అధికారిక ధృవీకరణ కాదు. చిరు ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందిందిగా ఉంది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉన్నట్లు తెలిసింది. ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు అంచనా. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు సమాచారం.

చిరంజీవికి ఖరిదైన లగ్జీరి కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ధృవీకరించలేదు. ఆయన ఆస్తిలో ప్రతి భాగం ఆయన కష్టార్జీతమే. సాధారణ స్థాయి నుంచి ఆయన మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. చిరుతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా భారీగానే ఆస్తులున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మెగా కోడలు ఉపాసనకు కూడా భారీగా ఆస్తులున్నట్లు సమాచారం.
ఇక టాలీవుడ్ పరంగా చూస్తే.. అక్కినేని నాగార్జున రూ.5,000 వేల కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి రూ .1,700, దగ్గుబాటి వెంకటేశ్ రూ. 1,650 కోట్లు, రామ్ చరణ్ రూ.1,400 కోట్లు ఆస్తులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. తెలుగు నటుడు అక్కినేని నాగార్జునకు ఎంటర్టైన్మెంట్ వ్యాపారాలు, క్రీడా పెట్టుబడులతో సంబంధం ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆయన బిగ్‌బాస్, మీలో ఎవరు కోటిశ్వరుడు వంటి కార్యక్రమాలను నిర్వహించడం, జడ్జిగా వ్యవహరించడం, టెలివిజన్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా పారితోషికం తీసుకుంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications