Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.. అవి ఏ విధంగా పని చేస్తాయి..!
చాలా మందికి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మందికి మ్యూచువల్ ఫండ్లు అంటే ఏమిటి. అవి ఏ విధంగా పని చేస్తేయో తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే.. ఒక ఫండ్ క్రియేట్ చేసి స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెట్టడం. ఈ ఫండ్ ను ఒక మేనేజర్ మెయింటెన్ చేస్తారు. అతన్ని ఫండ్ హౌస్ లు నియమిస్తాయి. మనం మ్యాచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన డబ్బును ఫండ్ మేనజర్ వివిధ స్టాక్ ల్లో పెట్టుబడి పెడుతుంటారు.
మన పెట్టుబడికి వారు యూనిట్లు కేటాయిస్తారు. వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక సులభమైన పద్ధతిని అందిస్తాయి. ఇవి చాలా తక్కువ మొత్తంలో డబ్బుతో పెట్టుబడులను అనుమతిస్తాయి కాబట్టి, కొత్త పెట్టుబడిదారులకు ఇవి మరింత అనుకూలంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా పెట్టుబడిదారుల డబ్బును స్టాక్స్, బాండ్లు లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెడతాయి. ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తారు. ఫండ్ వ్యూహం ఆధారంగా ఆస్తుల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిపుణులకు అపారమైన నైపుణ్యం ఉంటుంది. మీ పెట్టుబడిపై రాబడిని గరిష్ఠ స్థాయికి పెంచడమే వారి లక్ష్యం.

మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా యాక్టివ్లీ మేనేజ్డ్, పాసివ్లీ మేనేజ్డ్ అని రెండు రకాలుగా ఉంటాయి. యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్‌కు ఒక ఫండ్ మేనేజర్ అవసరం, అతను పెట్టుబడులను గరిష్ఠం చేయడానికి వాటిని జాగ్రత్తగా విశ్లేషించి ఎంచుకుంటాడు. మరోవైపు, పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు) ప్రధానంగా నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ వంటి నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్‌ను అనుకరించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ ఫండ్స్ ఒక ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి కాబట్టి, వీటికి కనీస నిర్వహణ అవసరం, ఖర్చులు తక్కువగా ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్ హౌస్ లు కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తాయి. అదే ఎక్స్పెన్సివ్ రేషియో. ఇది చాలా తక్కువగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఇన్‌కమ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, అగ్రెసివ్ గ్రోత్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. అయితే డెట్ ఫండ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంది. అయితే ఈక్విటీ ఫండ్స్ లోనే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్లలో మొదట్లో ఇన్వెస్ట్ చేసేవారు ఇండెక్స్ ఫండ్స్ , డెట్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం మంచిది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని గత గణంకాలు చెబుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications