Gold Price: కుప్పకూలిన బంగారం ధరలు.. 10 గ్రాములపై రూ.43 వేలు తగ్గిన పసిడి..!

బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో భారీగా పెరిగిన పసిడి ధరలు ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఆగస్ట్ లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల నమోదు అయింది. ఆ తర్వాత పుత్తడి ధర క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి అయిన బంగారం వైపు వెళ్లడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,79,140 చేరింది. ఇదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,800 లకు చేరింది. అంటే దాదాపు 25 శాతానికి పైగా తగ్గింది.

అయినప్పటికీ బంగారం ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల కింద నవంబర్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,999 గా ఉండేది. అక్కడి నుంచి 2026 జనవరి 28 కి వచ్చేసరికి రూ.1,79,140 చేరింది. అంటే 100 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. బంగారం ధరలు తులానికి రూ.లక్ష నుంచి రూ.లక్ష 10 వేల మధ్య ఉంటే సరైన ధర పేర్కొంటున్నారు. అయితే గోల్డ్ ధర ఈ స్థాయికి రావడం చాలా కష్టమంటున్నారు. పసిడి ధర ఒక వేళ భారీగా తగ్గిన రూ.1,20,000 నుంచి రూ.1,30,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితి.

Gold price

రష్యా, ఉక్రెయిన్ వార్. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వార్. అంతే కాకుండా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన చైనా భారీగా బంగారం కొనుగోలు చేసింది. టన్నుల్లో పసిడిని కొనుగోలు చేశారు. మిగతా దేశాల సెంట్రలు బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనుగోలు చేశాయి. దీంతో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు భారీగా తగ్గాలంటే.. చైనా సెంట్రల్ బ్యాంక్ పసిడి కొనుగోలు ఆపాలి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలి. అలా జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దేశీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ సీజన్ కావడంతో దేశంలో పసిడి వ్యాపారం ఊపందుకుంది.

మరో పక్క ల్యాబ్ గ్రౌన్ బంగారాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇది విజయవంతంగా కొనసాగితే బంగారం భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. పసిడి పై పెట్టుబడి పెట్టేవారు క్రమ క్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+