Rice Price: భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు.. కిలో రూ.90 నుంచి రూ.100..!
రాష్ట్రంలో బియ్యం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. క్వాలిటీ సన్న రకం బియ్యానికి కిలో రూ.90 నుంచి రూ.100 పలుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే సన్న బియ్యం కొరత ఉందా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో గత సంవత్సరం వరకు వరి భారీగా పండింది. ఈ సంవత్సరం వర్షాకాలంలో కూడా వరి సాగు బాగానే ఉంది. కానీ సన్న బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయని సామాన్యులు చర్చించుకుంటున్నారు. ఎల్ నినో బూచి చూపి వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు.
10 నెలల క్రితం వరకు సన్నబియ్యం కిలో రూ.45-50 నుంచి పలుకేవి. ఇక మేలు రకాలు రూ.60-65కే లభించేవి. ఇప్పుడు ధరలు అమాంతం పెరిగాయి. వచ్చే ఏడు, ఎనిమిది నెలల్లో కరువు వస్తుందని ఇప్పుడే సన్నబియ్యం ధరలు పెంచుతున్నారు. నాణ్యత, రకం, ప్రాంతాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.85-90 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్లు రూ.100 కూడా తీసుకుంటున్నారు. మూడు నెలల వ్యవధిలోనే 30-40 శాతంపైగా ధరలు పెంచారు. మరోవైపు రేషన్ బియ్యం కిలో రూ.12 నుంచి రూ.16 కొనుగోలు చేసి.. వాటిని ప్రాసెసింగ్ చేసి.. కిలో రూ.50 నుంచి రూ.60 లకు విక్రయిస్తున్నారు.

దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాగా మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు గోదాముల్లో లక్షల టన్నుల సన్నబియ్యాన్ని అక్రమంగా దాచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వరి పంట సాగు విషయానికొస్తే.. 2019-20లో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 72 లక్షల టన్నులు ఉంటే..2025-26 నాటికి 148.30 లక్షల టన్నులకు పెరిగింది. రాష్ట్ర అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి అవుతుంటే ధరలు తగ్గాల్సి పోయి.. పెరగడం ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కృత్రిమ కొరతగా చెబుతున్నారు. వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీ ధరకు ప్రజలకు విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం సన్న వడ్లు క్వింటా రూ.2800 నుంచి రూ.3100 పలుకుతోంది. అంటే కిల్లో రూ.31 పడుతుంది. అంటే కిలో వడ్లకు 700 గ్రాముల వరకు బియ్యం వస్తాయి. దీంతో వ్యాపారులు కిలో బియ్యం రూ.60 నుంచి రూ.70 లకు విక్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం 5 లక్షల టన్నుల సన్న వడ్లను వేలం వేస్తే కనీస ధరకు సైతం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు, వ్యాపారులెవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మరో విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తోంది. చాలా మంది ఈ బియ్యమే తింటున్నారు. డిమాండ్ భారీగా లేనప్పటికీ బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బియ్యం ధరలు ఇలా పెరిగితే సామాన్యులకు ఇబ్బందులు తప్పవు. సన్న బియ్యం ధరలు పెరగడంతో హోటల్లో కూడా ధరలు పెంచుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications