Cheyutha Pensions: రాష్ట్రంలో కొత్తగా 4.5 లక్షల పింఛన్లు.. మీకు వచ్చిందో లేదో తెలుసుకోండిలా..!

ఎంతో కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పింఛన్లు వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి మంజూరు పత్రాలు అందజేశారు. దీపావళి పండుగతో పాటు పుట్టిన రోజు సందర్భంగా సీఎం తన నియోజకవర్గం కొడంగల్ లోని హకీంపే ట్ లో మహిళ సంఘాలతో మాట్లాడారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

గత సర్కారు హయాంలో ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, సెర్ప్ ప్రత్యేక డ్రైవ్‌‌ల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పింఛన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. వార్డు, గ్రామ సభలు, ఆధార్‌‌ సీడింగ్‌‌ చేశారు. వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వితంతువుల నుంచి 3,31,236 దరఖాస్తులు రాగా దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.

Pensions

వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 4.5 లక్షల మందిని తొలి విడత పింఛన్ల కోసం ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 40.44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మంజూరైన 4.5 లక్షల కొత్త పింఛన్లను కలిపితే రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షలకు చేరింది. దీంతో ప్రభుత్వం ఆర్థిక భారం పడినా.. పింఛన్లు అందిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లలో దాదాపు 3 లక్షలు వితంతువుల పింఛన్లు, ఒంటరి మహిళలు ఉన్నట్లు తెలిసింది. అలాగే లక్ష మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్ మంజూరు చేశారు. మరో 50 వేల మంది చేనేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశారు.

పింఛను మంజూరు పత్రాలు అందుకున్నవారికి ఈ నెల నుంచి పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. కాగా తెలంగాణల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త రేషన్ కార్డులతో పాటు, కొత్త పింఛన్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త పింఛన్లు వచ్చాయో రాలేదో తెలుసుకునేందుకు చేయూత వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. లేదా స్థానిక కార్యదర్శి లేదా ఎంపీడీఓ వద్దకు వెళ్తే మీరు పింఛను మంజూరు చేశారో లేదో తెలిసిపోతుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+