Cheyutha Pensions: గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ..!
రాష్ట్రంలో కొత్తగా మంజూరు అయిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పింఛన్ల పంపిణీ నవంబర్ 18లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త పింఛన్లను కొడంగల్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఆ వెంటనే జిల్లాల్లో ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ కాస్త ఆలస్యం అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లా జాబితాను సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాలో కొత్త పింఛన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తారు. ఈనెల 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్మును జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పింఛన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. వార్డు, గ్రామ సభలు, ఆధార్ సీడింగ్ చేశారు. వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వితంతువుల నుంచి 3,31,236 దరఖాస్తులు రాగా దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 4.5 లక్షల మందిని తొలి విడత పింఛన్ల కోసం ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 40.44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మంజూరైన 4.5 లక్షల కొత్త పింఛన్లను కలిపితే రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షలకు చేరింది. దీంతో ప్రభుత్వం ఆర్థిక భారం పడినా.. పింఛన్లు అందిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లలో దాదాపు 3 లక్షలు వితంతువుల పింఛన్లు, ఒంటరి మహిళలు ఉన్నట్లు తెలిసింది. అలాగే లక్ష మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్ మంజూరు చేశారు. మరో 50 వేల మంది చేనేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications