Small Cap Mutual Funds: సెప్టెంబర్‌లో అత్యధిక పెట్టుబడులు సాధించిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే..!
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం సెప్టెంబర్ లో స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో రూ. 7,973.33 కోట్ల నుంచి 13.4 శాతం పెరిగి రూ. 9,038.57 కోట్లను అందుకుంది. సెప్టెంబర్ మార్కెట్ క్షీణత సమయంలో స్మాల్ క్యాప్ స్టాక్‌లు మెరుగ్గా ఉన్నాయి. నిఫ్టీ 50లో 6.06 శాతం, నిఫ్టీ 500లో 5.88 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150లో 7.09 శాతం క్షీణతతో పోలిస్తే నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 3.12 శాతం పడిపోయింది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ ఫండ్ లోకి రూ. 2,191 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ లోకి రూ. 982 కోట్లు. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లోకి రూ. 750 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మూడు ఫండ్లు పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగించినప్పటికీ, సెప్టెంబర్‌లో ప్రతికూల రాబడిని నమోదు చేశాయి.
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్-క్యాప్ ఫండ్ లోకి సెప్టెంబర్‌లో రూ. 2,191 కోట్లు రాగా.. ఆగస్టులో రూ. 2,187 కోట్లు వ్చాయి. ఈ ఫండ్ 1.50 శాతం ప్రతికూల నెలవారీ రాబడిని అందించినప్పటికీ, ఫండ్ AUM ఆగస్టులో రూ. 34,176 కోట్ల నుంచి సెప్టెంబర్‌లో రూ. 35,856 కోట్లకు పెరిగింది. బంధన్ ఫండ్ 261 స్టాక్లను హోల్డ్ చేస్తోంది. టాప్ 10 హోల్డింగ్స్ పోర్ట్‌ఫోలియోలో కేవలం 17.36 శాతం మాత్రమే ఉన్నాయి. ఇది ఇన్వెస్కోకి 1.10 శాతం, నిప్పాన్ ఇండియాకు 2.65 శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. దాని పోర్ట్‌ఫోలియోలో దాదాపు 68.36 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టబడింది, మరో 9.67 శాతం మిడ్ క్యాప్స్‌లో, 6.71 శాతం లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టింది.

సెప్టెంబర్ క్షీణత ఉన్నప్పటికీ బంధన్ ఆరు నెలల రాబడిని 26.22 శాతం, మూడేళ్ల రాబడిని 21.99 శాతం రాబడి అందించింది. ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ సెప్టెంబర్‌లో రూ. 982 కోట్ల ఇన్‌ఫ్లోలను ఆకర్షించింది. ఆగస్టులో ఇది రూ.793 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ కేవలం 75 స్టాక్లను హోల్డ్ చేస్తోంది. దాని టాప్ 10 పోర్ట్‌ఫోలియోలో 34.19 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఫండ్ 65.79 శాతం స్మాల్ క్యాప్స్‌లో, 15.61 శాతం మిడ్ క్యాప్స్, 14.97 శాతం లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టింది. ఈ మూడింటిలో ఈ ఫండ్ 3.78 శాతం పడిపోయి సెప్టెంబర్‌లో అత్యధిక క్షీణతను నమోదు చేసింది. అయితే ఆరు నెలల్లో 27.51 శాతం, సంవత్సరంలో 14.42 శాతం రాబడి అందించింది. దీని AUM ఆగస్టులో రూ.15,744 కోట్ల నుండి సెప్టెంబర్‌లో రూ.16,131 కోట్లకు పెరిగింది.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అతిపెద్ద AUM కలిగిన ఫండ్. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ సెప్టెంబర్‌లో రూ. 750 కోట్ల ఇన్‌ఫ్లోలను ఆకర్షించింది. ఇది ఆగస్టులో రూ. 757 కోట్లకు సమానం.
80,906 కోట్ల AUM పరంగా ఇది బంధన్, ఇన్వెస్కో రెండింటి కంటే పెద్దదిగా ఉంది. అయితే, ఫండ్ 2.94 శాతం ప్రతికూల నెలవారీ రాబడిని అందించింది. ఈ ఫండ్ 256 స్టాక్లను హోల్డ్ చేస్తోంది.స్మాల్ క్యాప్స్ 69.11 శాతం వాటా కలిగి ఉండగా, లార్జ్ క్యాప్స్ 14.31, మిడ్ క్యాప్స్ 13.06 శాతం పెట్టుబడి పెట్టింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications