Mutual Funds: పెట్టుబడిదారులను ముంచేసిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆ నెలలోమ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు 10 శాతం వరకు నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో బెంచ్‌మార్క్ సూచీ అయిన నిఫ్టీ 50, 5.56 శాతం క్షీణించింది. ఈ కాలంలో దాదాపు 666 ఫండ్లు ఉండగా, వాటిలో 634 ఫండ్లు ప్రతికూల రాబడులను అందించాయి. అంటే దాదాపు 95% ఫండ్లు ప్రతికూల రాబడులను ఇచ్చాయి. అత్యధికంగా నష్టపోయిన ఐదు ఫండ్లు టెక్ రంగ ఆధారిత ఫండ్లే ఉన్నాయి. వాటిలో మూడు ఫండ్లు 9% పైగా నష్టపోయాయి. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అత్యధికంగా దాదాపు 9.80% నష్టపోగా, దాని తర్వాత హెచ్‌డిఎఫ్‌సి టెక్నాలజీ ఫండ్ 9.30 శాతం, డబ్ల్యుఓసి డిజిటల్ భారత్ ఫండ్ 9.28% నష్టపోయాయి.
టెక్ రంగ ఆధారిత ఇతర రెండు ఫండ్లలో ఐసిఐసిఐ ప్రూ టెక్నాలజీ ఫండ్ 8.94 శాతం టాటా నిఫ్టీ ఇండియా డిజిటల్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్ 8.82% నష్టపోయాయి. గ్రోవ్ నిఫ్టీ ఈవీ & న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్ సెప్టెంబర్‌లో 8.75% ప్రతికూల రాబడిని అందించగా, దాని తర్వాత ఎస్‌బిఐ క్వాంట్ ఫండ్ 8.70 శాతం, ఆదిత్య బిర్లా ఎస్ఎల్ డిజిటల్ ఇండియా ఫండ్ 8.65% నష్టపోయాయి. ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్ 7.81 శాతం, డిఎస్‌పి బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ 7.74% ప్రతికూల రాబడులను అందించాయి. ఐసిఐసిఐ ప్రూ నిఫ్టీ ఈవీ & న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్ ఇదే కాలంలో 7.18% నష్టపోయింది.

ఆస్తుల ఆధారంగా అతిపెద్ద మిడ్ క్యాప్ ఫండ్ అయిన హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్ సెప్టెంబర్ నెలలో 6.40% నష్టపోయింది. ఆదిత్య బిర్లా SL MNC ఫండ్, ఎడల్‌వీస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు 6.21% చొప్పున ప్రతికూల రాబడిని అందించాయి. సుందరం మిడ్ క్యాప్ ఫండ్, ఎడల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్, WOC బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ICICI ప్రు మిడ్ క్యాప్ ఫండ్లు సెప్టెంబర్‌లో 6.11% చొప్పున నష్టపోయాయి. వెల్త్ కంపెనీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సెప్టెంబర్‌లో 5.91% ప్రతికూల రాబడిని ఇచ్చింది. HDFC లార్జ్ క్యాప్ ఫండ్, WOC లార్జ్ క్యాప్ ఫండ్లు సెప్టెంబర్‌లో 5.82% చొప్పున నష్టపోయాయి. జియోబ్లాక్‌రాక్ లార్జ్ క్యాప్ ఫండ్ 5.54% ప్రతికూల రాబడిని ఇచ్చింది. కోటక్ ఫోకస్డ్ ఫండ్, ఆదిత్య బిర్లా SL లార్జ్ క్యాప్ ఫండ్, ఎడల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్లు సెప్టెంబర్‌లో 5.41% చొప్పున నష్టపోయాయి. పరాగ్ పారిఖ్ లార్జ్ క్యాప్ ఫండ్ 5.37% ప్రతికూల రాబడిని ఇచ్చింది.
సెక్టోరల్ ఫండ్ అయిన ICICI ప్రు బిజినెస్ సైకిల్ ఫండ్ 5.24% ప్రతికూల రాబడిని నమోదు చేసింది.HDFC మ్యూచువల్ ఫండ్‌కు చెందిన HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, HDFC డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ FOF ఫండ్లు 5.05% చొప్పున నష్టపోయాయి. రక్షణ రంగంపై ఆధారపడిన ఏకైక యాక్టివ్‌గా నిర్వహించబడే ఫండ్ అయిన హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ ఇదే కాలంలో 3.47% ప్రతికూల రాబడిని అందించింది. సెప్టెంబర్‌లో సుమారు 32 ఫండ్‌లు సానుకూల రాబడులను అందించాయి. సెప్టెంబర్‌లో సామ్కో స్మాల్ క్యాప్ ఫండ్ 6.62%తో అత్యధిక రాబడిని అందించగా, దాని తర్వాతి స్థానంలో మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఇండియా ఫండ్ 4.85% రాబడిని ఇచ్చింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ సెప్టెంబర్‌లో 0.65% రాబడిని అందించింది. యాక్సిస్ ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఓమ్ని ఎఫ్‌ఓఎఫ్, టాటా ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌ఓఎఫ్ అదే కాలంలో చెరో 0.01% రాబడిని ఇచ్చాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
