Flights: 18-65 మధ్య పురుషులకు విమాన టిక్కెట్లు బంద్.. ప్రభుత్వం సెన్సేషనల్ నిర్ణయం.. ఎందుకంటే..?

Flights: 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మగవారికి విమాన టిక్కెట్లు అమ్మెుద్దని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రష్యాలోని విమానయాన సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీడియా వార్తలు వైరల్ కావటంతో.. పుతిన్ నియంతృత్వ పాలనకు ఇది అద్ధం పడుతుందని అనేక మంది మండిపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

టిక్కెట్ల బ్యాన్..

టిక్కెట్ల బ్యాన్..

రష్యన్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. రష్యన్ ఎయిర్‌లైన్స్ 18-65 ఏళ్ల మధ్య వయసున్న రష్యన్ పురుషులకు విమాన టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేశాయి. ఉక్రెయిన్‌తో పోరాడేందుకు మరిన్ని దళాలను సమీకరించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ కారణంగా అక్కడి మగవారిని విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు.

టర్కిష్ ఎయిర్‌లైన్స్..

టర్కిష్ ఎయిర్‌లైన్స్..

రష్యా నుంచి అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్, కజకిస్తాన్‌లకు నేరుగా నడిచే విమానాల్లో బుధవారం టిక్కెట్లు అన్నీ అమ్ముడయ్యాయని ప్రముఖ రష్యన్ వెబ్‌సైట్ Aviasales తెలిపింది. అదేవిధంగా.. రష్యా నుంచి పొరుగు దేశాలకు ప్రయాణ టిక్కెట్లు పూర్తిగా బుక్ అయినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

అనుమతి లేదు..

అనుమతి లేదు..

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన యువకులు మాత్రమే దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబడతారని తెలుస్తోంది. ఇతరులు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదు.

భారీ సైనిక వ్యూహం..

భారీ సైనిక వ్యూహం..

ఉక్రెయిన్‌తో యుద్ధం తారా స్థాయికి చేరుకోవడంతో 3,00,000 మందిని సైనిక సేవల కోసం పిలవవచ్చని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. కాబట్టి రష్యా నుంచి 18-65 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు కొంతకాలం విదేశాలకు వెళ్లలేరు. దేశరక్షణకు అవసరమైన సైనికుల కోసం రష్యా ఈ సంచలన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+