No UPI Day: అక్టోబర్ 2న నో యూపీఐ డేకు పిలుపునిచ్చిన వ్యాపార సంఘాలు..

అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై విధించనున్న 0.4 శాతం 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)కు నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు, వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న "నో UPI డే" (UPI రహిత దినం) పాటించాలని నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా గాంధీ జయంతిగా జరుపుకునే ఈ రోజున నిరసనలో భాగంగా యూపీఐ స్కానర్లు, QR కోడ్‌లు, సౌండ్ బాక్స్‌లు, ఇతర సంబంధిత పరికరాలను నల్లని వస్త్రంతో కప్పి ఉంచాలని వారు భావిస్తున్నారు. అక్టోబర్ 2ని 'నో UPI డే'గా పాటించాలని మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ & అగ్రికల్చర్ (MACCIA) పిలుపునిచ్చిందని ఆ సంస్థ అధ్యక్షుడు రవీంద్ర మంగవే తెలిపారు.

తాము భారతదేశంలోని అన్ని వ్యాపార సంఘాలతో మాట్లాడామన ఆయన పేర్కొన్నారు. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా 'నో UPI డే' పాటించాలని నిర్ణయించుకున్నామని వివరించారు. MACCIA, దాని అనుబంధంగా ఉన్న 500 సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి తమ డిమాండ్లను ఆయన ముందు ఉంచాలని యోచిస్తున్నాయని ఆయన తెలిపారు. అక్టోబర్ 2న నిర్వహించనున్న 'నో యూపీఐ డే' (No UPI Day)కు మద్దతు తెలిపే దేశంలోని ముఖ్యమైన సంఘాలలో ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA), ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF), ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA), ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF), ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ (AIEOTF) ఉన్నాయని మంగవే ప్రకటించారు.

No UPI Payments

ఎండీఆర్ అనేది డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు వ్యాపారి చెల్లించే రుసుము. వ్యక్తుల మధ్య (P2P) జరిగే యూపీఐ లావాదేవీలకు ఎటువంటి రుసుము ఉండదు. వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) జరిగే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.40 శాతం రుసుము (గరిష్టంగా రూ.300 వరకు) వర్తిస్తుంది. చిన్న విక్రేతలకు చేసే చెల్లింపులు - వీటిని 'పర్సన్-టు-పర్సన్-మర్చంట్' (P2PM) లావాదేవీలుగా వర్గీకరించారు. వాటిపై కూడా ఎటువంటి MDR ఉండదు. గత వారం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు 'ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్' (AIPDA) ప్రతినిధులతో సమావేశమయ్యారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డీలర్ల డిమాండ్‌పై ఇందులో చర్చించారు.

యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో నిధుల బదిలీకి సంబంధించి కొత్త ఎండీఆర్ పై స్టాక్ బ్రోకర్లు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిశీలిస్తామని సెబీ (Sebi) ఛైర్‌పర్సన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్లు, డీలర్లు, పెట్టుబడి సలహాదారులకు చేసే చెల్లింపులకు సంబంధించి, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై ఎండిఆర్ ను 0.02 శాతంగా (గరిష్టంగా ₹300 పరిమితితో) నిర్ణయించారు. మహాత్మా గాంధీ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ, నిరసన చిహ్నంగా యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు, ఇతర సంబంధిత పరికరాలను నల్లటి వస్త్రంతో కప్పి, గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు నిరసన చేపట్టాలని దేశవ్యాప్తంగా వివిధ వ్యాపార సంఘాలు నిర్ణయించాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+