UPI Payments: అక్టోబర్‌లో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్..!
అక్టోబర్ లో యూపీఐ లావాదేవీలు రికార్డు క్రియేట్ చేశాయి. ఆ నెలలో యూపీఐ ద్వారా జరిగిన సగటు రోజువారీ లావాదేవీల విలువ మొదటిసారిగా రూ. 1 లక్ష కోట్లను దాటి చరిత్ర సృష్టించాయి. పండుగ సీజన్లో వినియోగదారుల వ్యయం పెరగడంతో మొత్తం నెలవారీ లావాదేవీల విలువ రూ.31.53 లక్ష కోట్లకు చేరుకుందని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు సెప్టెంబరు నెలలో నమోదైన సగటు రోజువారీ లావాదేవీల విలువ దాదాపు రూ. 98,000 కోట్లుగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం యూపీఐ ద్వారా జరిగిన నెలవారీ లావాదేవీల విలువ రూ. 30 లక్ష కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే మొదటిసారి. గతంలో అత్యధిక నెలవారీ లావాదేవీల విలువ మేలో రూ. 29.9 లక్ష కోట్లుగా నమోదైంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ డిజిటల్ చెల్లింపుల వేదిక అక్టోబరులో 25.47 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. అంటే రోజుకు సగటున 821 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపులలో 89 శాతం వాటా యూపీఐదే ఉంది. సాధారణంగా 30 రోజులు ఉండే నెలలతో పోలిస్తే 31 రోజులు ఉన్న నెలల్లో వినియోగదారుల వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల యూపీఐ లావాదేవీల సంఖ్య కూడా ఆ నెలల్లో అధికంగా నమోదవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబరు నెలలో సగటు రోజువారీ లావాదేవీల సంఖ్య 802 మిలియన్లుగా ఉండగా, ఆగస్టు నెలలో అత్యధికంగా 24.5 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.

యూపీఐ లావాదేవీలలో ఈ రికార్డు స్థాయి వృద్ధి, చెల్లింపుల వ్యవస్థలో కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) ఛార్జీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో యూపీఐ పేమెంట్ల విలువ పెరగడం గమనార్హం. పండుగ సీజన్‌కు ముందు వినియోగదారుల మనోభావాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు, అలాగే ఎండీఆర్ రేట్లు, విధానాలు, వాటి అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో, వ్యాపార సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, చెల్లింపుల సంస్థలు ఈ ఛార్జీల అమలును వాయిదా వేయాలని కోరడంతో వాయిదా వేశారు. సెప్టెంబరులో యూపీఐ స్టీరింగ్ కమిటీ రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై MDRని 0.4 శాతం (అంటే 40 బేసిస్ పాయింట్లు)గా నిర్ణయించింది.
ఎండీఆర్ అనేది డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల (మర్చంట్ల) నుంచి వసూలు చేసే రుసుము. 0.4 శాతం రేటుతో, ఈ ఛార్జీ ప్రకారం యూపీఐ ద్వారా చేసే ప్రతి రూ. 2,000 చెల్లింపునకు రూ. 8 లేదా ప్రతి రూ. 10,000 చెల్లింపునకు రూ. 40 వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత ఎండీఆర్ ద్వారా బ్యాంకులు, చెల్లింపు సంస్థలకు దాదాపు రూ. 15,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications