Mutual Funds: అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేసిన లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవే..!
అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కొన్ని కంపెనీలలో తమ పెట్టుబడులను పెంచుకుంటూ, మరికొన్నింటిలో తమ వాటాలను తగ్గించుకున్నారు. మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేసిన, అలాగే విక్రయించిన లార్జ్, మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. అక్టోబర్ 2026లో మ్యూచువల్ ఫండ్ షేర్ హోల్డింగ్స్‌లో అత్యధిక పెరుగుదల, తగ్గుదలను నమోదు చేసిన ప్రతి మార్కెట్-క్యాప్ విభాగంలోని స్టాక్స్ ఏమిటో చూద్దాం. మ్యూచువల్ ఫండ్లు అక్టోబర్ లార్జ్ క్యాప్ స్టాక్ అయిన మాక్స్ హెల్త్‌కేర్ హోల్డిగ్స్ పెంచుకున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ల సంఖ్య నెలవారీగా 15.6 శాతం పెరిగి 2.10 కోట్లకు చేరుకుంది.
దీని తర్వాత ఐటీసీ నిలిచింది. మ్యూచువల్ ఫండ్ షేర్ హోల్డింగ్స్ 13.3% పెరిగి 235.41 కోట్ల షేర్లకు చేరుకున్నాయి. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్‌లో పెరుగుదలను చూసిన లార్జ్-క్యాప్ స్టాక్‌లలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, నెస్లే ఇండియా కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు లార్జ్ క్యాప్ స్టాక్ ల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఫండ్ల హోల్డింగ్స్ నెలవారీగా 3.5% తగ్గి 24.92 కోట్ల షేర్లకు పడిపోయాయి. బజాజ్ ఆటో 3.4% క్షీణతతో దాని తర్వాతి స్థానంలో నిలవగా, కోల్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాటాలు 2.5% తగ్గాయి. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీలలో కూడా వాటాలు చెరో 2.1% మేర తగ్గాయి.

మిడ్-క్యాప్ స్టాక్స్‌లో రైల్ వికాస్ నిగమ్ స్టాక్ ను మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ వద్ద ఉన్న షేర్ల సంఖ్య నెలవారీగా 25.4% పెరిగి 0.63 కోట్లకు చేరుకుంది. దీని తర్వాత ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ నిలిచింది. మ్యూచువల్ ఫండ్ల వద్ద వీటి షేర్లు 18.4% పెరిగి 3.17 కోట్ల షేర్లకు చేరుకున్నాయి. మ్యూచువల్ ఫండ్లు మిడ్ క్యాప్ స్టాక్ ల్లో పతంజలి ఫుడ్స్ షేర్లను ఎక్కువగా విక్రయించాయి. దీని తర్వాత సుజ్లాన్ ఎనర్జీ 14.7% క్షీణతతో నిలవగా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8.2% పతనాన్ని నమోదు చేసింది. స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో సెమిండియా ప్రాజెక్ట్స్ లో మ్యూచువల్ ఫండ్లు వాటాలను పెంచుకున్నాయి.
నాట్కో ఫార్మా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. మ్యూచువల్ ఫండ్లలో ఈ కంపెనీ షేర్ల232.5% పెరిగి 1.31 కోట్ల షేర్లకు చేరుకున్నాయి. స్మాల్ క్యాప్ విభాగంలో మ్యూచువల్ ఫండ్లు ఐడిబిఐ బ్యాంక్ షేర్లను ఎక్కువగా విక్రయించాయి. ఆ తర్వాతి స్థానంలో ఎమ్వీ ఫోటోవోల్టాయిక్ ఉంది. ఆ తర్వాత చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications