Mutual Funds: లార్జ్ క్యాప్ ఫండ్లకు టైమొచ్చిందా.. అక్టోబర్‌లో రాణించిన ఫండ్లు ఇవే..!
అక్టోబర్ లో వివిధ మ్యూచువల్ ఫండ్ కేటగిరీల పనితీరులో తీవ్రమైన తేడాలు కనిపించాయి. ఆ నెలలో లార్జ్‌క్యాప్ ఫండ్లు 9.8 శాతం రాబడిని అందించగా, స్మాల్‌క్యాప్ ఫండ్లు కేవలం 0.7 శాతం రాబడిని ఇచ్చాయి. మరోవైపు మిడ్‌క్యాప్ ఫండ్లు 4 శాతం రాబడిని అందించాయి. ఈ మార్పు రాబడులలోనే కాకుండా పెట్టుబడులు స్వీకరించడంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. లార్జ్‌క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గాయి. దీనివల్ల పెట్టుబడిదారులు స్మాల్‌క్యాప్ ఫండ్లపై తమ ఉత్సాహాన్ని కొంత కోల్పోయి, పెద్ద కంపెనీల షేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వాలమ్ క్యాపిటల్ అడ్వైజర్స్ వారి నివేదిక ప్రకారం గత నెలలో భారతీయ ఈక్విటీలు బలంగా పుంజుకున్నాయి. ఈ కాలంలో భారతీయ ఈక్విటీ ఫండ్లు సగటున 6 శాతం రాబడిని అందించాయి. అదే సమయంలో గ్లోబల్ ఈక్విటీ ఫండ్లు 6.5 శాతం క్షీణించగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టే ఫండ్లు 7.7 శాతం పడిపోయాయి. గత నెలలో భారతీయ ఈక్విటీ ఫండ్లలోకి నికర పెట్టుబడుల ప్రవాహం రూ.39,071 కోట్ల నుంచి రూ.40,410 కోట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. గత నెలలో మ్యూచువల్ ఫండ్ వర్గాల మధ్య పనితీరు అంతరం గణనీయంగా పెరిగింది.

లార్జ్‌క్యాప్ ఫండ్లు 9.8 శాతం రాబడిని అందించగా, మిడ్‌క్యాప్ ఫండ్లు 4 శాతం, స్మాల్‌క్యాప్ ఫండ్లు కేవలం 0.7 శాతం రాబడిని అందించాయి. అంటే ఒకే నెలలో లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్ల రాబడుల మధ్య అంతరం 9.1 శాతం పాయింట్లుగా ఉంది. భారతీయ ఈక్విటీలలోకి విదేశీ పెట్టుబడిదారులు తిరిగి రావడం ఈ ర్యాలీ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. వారి కొనుగోళ్లు ఎక్కువగా పెద్ద కంపెనీల షేర్లలోనే కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల ఈ మార్కెట్ ర్యాలీ అన్ని కంపెనీలకు ఏకరీతిగా ప్రయోజనం చేకూర్చలేదు. పెద్ద కంపెనీల స్టాక్‌లు బలమైన కొనుగోళ్లను ఆకర్షించగా చిన్న కంపెనీలు వెనుకబడ్డాయి.
పెట్టుబడి ప్రవాహాలు కూడా మారుతున్న ధోరణిని సూచిస్తున్నాయి. లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు ఒక నెలలో దాదాపు 44 శాతం పెరిగి.. ర.9,634 కోట్ల నుంచి రూ.13,887 కోట్లకు చేరింది. దీనికి భిన్నంగా స్మాల్‌క్యాప్ ఫండ్లలోకి వచ్చే నికర పెట్టుబడులు రూ.8,071 కోట్ల నుంచి రూ.5,152 కోట్లకు తగ్గాయి. అంటే దాదాపు 36 శాతం క్షీణత నమోదైంది. దీని అర్థం పెట్టుబడిదారులు స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మానేశారని కాదు. అక్టోబరు నెలలో కూడా ఈ విభాగంలోకి రూ.5,000 కోట్లకు పైగా నికర పెట్టుబడులు వచ్చాయి. అయితే, అంతకుముందు నెలతో పోలిస్తే పెట్టుబడిదారుల ఆసక్తి స్పష్టంగా తగ్గింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications