Mutual Funds Inflows: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి తగ్గిన పెట్టుబడులు..!
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అక్టోబర్ లో రూ. 1.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నికర పెట్టుబడులు నెలవారీగా దాదాపు 14 శాతం తగ్గి రూ. 38,307 కోట్ల నుంచి రూ. 32,994 కోట్లకు పడిపోయాయి. సెప్టెంబర్‌లోని రూ. 38,306.55 కోట్ల నుంచి నికర పెట్టుబడుల ప్రవాహం 13.9 శాతం తగ్గి రూ. 32,993.64 కోట్లకు పడిపోయినప్పటికీ, అక్టోబర్‌లో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగించాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం ఈక్విటీ ఫండ్ ఏయూఎం (AUM) కూడా గత నెలలోని రూ. 37.54 లక్షల కోట్ల నుంచి రూ. 37.15 లక్షల కోట్లకు పడిపోయింది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం తగ్గుదలకు ప్రతికూల మార్క్-టు-మార్కెట్ కదలికలే కారణమని ఏఎంఎఫ్ఐ (AMFI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని పేర్కొన్నారు. ఈ విభాగంలో సానుకూల నికర పెట్టుబడుల ప్రవాహం నమోదైనప్పటికీ, ఈక్విటీ ఏయూఎం నెలవారీగా దాదాపు రూ. 39,724 కోట్లు లేదా 1.1 శాతం తగ్గింది. అక్టోబరు నెలలో ఈక్విటీ విభాగాల్లో 'లార్జ్ అండ్ మిడ్-క్యాప్' ఫండ్లు అత్యధికంగా రూ. 8,484.23 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది సెప్టెంబరులో నమోదైన రూ. 4,271.22 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో స్మాల్-క్యాప్ ఫండ్లు రూ. 6,407.50 కోట్ల పెట్టుబడులను పొందాయి .

మిడ్-క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు సెప్టెంబరులోని రూ. 7,834.84 కోట్ల నుంచి రూ. 4,892.62 కోట్లకు తగ్గాయి. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు రూ. 4,979.95 కోట్లను పొందగా, లార్జ్-క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు సెప్టెంబరులోని రూ. 859.47 కోట్ల నుండి రూ. 1,032.39 కోట్లకు పెరిగాయి. కాంట్రా ఫండ్లు కూడా తిరిగి సానుకూల ధోరణిలోకి వచ్చి, రూ. 1,694.13 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. సెప్టెంబరులో వీటి నుంచి రూ. 97.88 కోట్ల నిధులు బయటకు వెళ్లాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో అక్టోబరు నెలలో రూ. 1,13,437.89 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబరులో వీటి నుంచి రూ. 1,83,155.76 కోట్ల నికర నిధులు బయటకు వెళ్లాయి.
నెలవారీగా చూస్తే, దాదాపు రూ. 2.97 లక్షల కోట్ల వ్యత్యాసం నమోదైంది. డెట్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) కూడా సెప్టెంబరులోని రూ. 17.64 లక్షల కోట్ల నుంచి అక్టోబరులో రూ. 18.81 లక్షల కోట్లకు పెరిగింది. డెట్ ఫండ్లలో వచ్చిన ఈ పునరుద్ధరణే, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోలుకోవడానికి ప్రధాన కారణమైంది. అక్టోబరు నెలలో లిక్విడ్ ఫండ్లలోకి రూ. 70,533.75 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబరులో వీటి నుంచి రూ. 95,743.20 కోట్లు బయటకు వెళ్లగా, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అలాగే ఓవర్‌నైట్ ఫండ్లు కూడా తిరిగి సానుకూల స్థితికి చేరుకున్నాయి. గత నెలలో వీటి నుంచి రూ. 7,281.20 కోట్లు బయటకు వెళ్లగా ఈసారి రూ. 54,893.05 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications