HDFC Defence Fund: అక్టోబర్‌లో హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసిన స్టాక్స్ ఇవే..!
యాక్టివ్ ఫండ్ అయిన హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ 2026 అక్టోబర్ లో తన పోర్ట్‌ఫోలియోను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఐదు స్టాక్‌లలో తన వాటాలను పెంచుకోవడంతో పాటు, మూడు కొత్త స్టాక్లను చేర్చింది. ఈ చేర్పులతో అక్టోబర్ చివరి నాటికి ఫండ్ మొత్తం పోర్ట్‌ఫోలియో 27 స్టాక్‌లకు విస్తరించింది. హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ భారతదేశంలో ఉన్న ఏకైక ఓపెన్-ఎండెడ్ డిఫెన్స్ థీమాటిక్ స్కీమ్. ఇది ప్రధానంగా రక్షణ, అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కంపెనీల ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది. ఏరోస్పేస్, రక్షణ, ఆటో విడిభాగాలు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, పారిశ్రామిక తయారీ, ఇతర సంబంధిత పరిశ్రమల వంటి విభాగాలలో చురుకుగా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఫండ్ మేనేజర్‌కు ఉంది.
2026 సెప్టెంబర్ 30 నాటికి ఫండ్ యొక్క నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) ₹11,493 కోట్లుగా ఉండగా.. 2026 అక్టోబర్ 31 నాటికి అవి రూ.11,131 కోట్లకు తగ్గాయి. 2026 నవంబర్ 9 నాటికి, హెచ్డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ ఒక సంవత్సరంలో 21.04% రాబడిని అందించింది. ఇది 14.19% రాబడిని ఇచ్చిన దాని బెంచ్‌మార్క్, నిఫ్టీ ఇండియా డిఫెన్స్ TRIని అధిగమించింది. అయితే, మూడు సంవత్సరాల కాలంలో ఫండ్ రాబడి 34.08 శాతం రాబడి ఇచ్చింది. ఇది బెంచ్‌మార్క్ 39.70% కంటే తక్కువ. 30 సెప్టెంబర్, 31 అక్టోబర్ 2026 మధ్య ఫండ్ హోల్డింగ్స్ ఎలా మారాయో చూద్దాం.

ఫండ్ హోల్డింగ్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్ అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. దీని వాటా సెప్టెంబర్లోని 440 లక్షల షేర్ల నుంచి అక్టోబర్ 2026 నాటికి 470.18 లక్షల షేర్లకు, అంటే 30.18 లక్షల షేర్లు పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ కూడా టాటా మోటార్స్‌లో తన వాటాను 1.42 లక్షల షేర్లు పెంచుకుని, మొత్తం వాటాను 30.46 లక్షల షేర్లకు చేర్చింది. బిఇఎంఎల్లో దీని వాటా 30.11 లక్షల షేర్లకు పెరగ్గా, భారత్ ఫోర్జ్‌లో వాటా 77.51 లక్షల షేర్లకు పెరిగింది. బోష్లో కూడా వాటా 0.13 లక్షల షేర్లు పెరిగి 1.13 లక్షల షేర్లకు చేరింది. కొత్తగా చేరిన వాటిలో, టోన్బో ఇమేజింగ్ ఇండియా 14.54 లక్షల షేర్లతో అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాతి స్థానంలో బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్మిషన్స్ 4.55 లక్షల షేర్లతో ఉన్నాయి. పీటీసీ ఇండస్ట్రీస్ వాటా 0.24 లక్షల షేర్లుగా ఉంది.
అక్టోబర్‌లో హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ ఏ స్టాక్‌లోని తన హోల్డింగ్స్‌ను తగ్గించలేదు లేదా పూర్తిగా విక్రయించలేదు. వీటిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ 46.61 లక్షల షేర్లతో తన హోల్డింగ్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా అతిపెద్దదిగా నిలిచింది. దాని తర్వాత ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ 45.23 లక్షల షేర్లతో, సైయంట్ డీఎల్ఎం 40 లక్షల షేర్లతో ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ అతిపెద్ద పోర్ట్‌ఫోలియో హోల్డింగ్‌గా కొనసాగింది. ఇది దాని నికర ఆస్తి విలువ (NAV)లో 15.63% వాటాను కలిగి ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్ తర్వాతి రెండు అతిపెద్ద హోల్డింగ్స్‌గా ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications