క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమవుతోంది. కేవలం ఒక వారంలోనే ఏకంగా 51వేల డాలర్లకు పడిపోయింది. భారత కరెన్సీలో రూ.8,00,000 క్షీణించి రూ.41,24,000కి పతనమైంది. క్రిప్టోకరెన్సీ కింగ్‌గా ఉన్న బిట్ కాయిన్ గత వారం ఆల్ టైమ్ గరిష్టం రూ.64,829.14 డాలర్లకు (48.46 లక్షలు) చేరుకుంది. అయితే ఇప్పుడు ఇది 53,705.54 డాలర్లకు(సుమారు 41 లక్షలు) పతనమైంది. గత అయిదు సెషన్‌లలో క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ లక్షల్లో పడిపోయింది.

అందుకే బిట్ కాయిన్ పతనం
కాయిన్‌డెస్క్ ప్రకారం ఉదయం గం.11 సమయానికి బిట్ కాయిన్ 54,978.74 డాలర్లు (రూ.41.10) డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు ఇటీవల పతనమవుతున్నాయి. ఇందుకు పలు కారణలు ఉన్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రిప్టోకరెన్సీని ఉపయోగించడంపై అమెరికా అధికారుల కఠిన చర్యలు, టర్కీ సెంట్రల్ బ్యాంకు క్రిప్టో కరెన్సీని, క్రిప్టో ఆస్తులను కొనుగోలును నిషేధించినట్లు వార్తలు వచ్చిన తర్వాత బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు క్షీణించాయి.

చైనా నిర్ణయం
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంధనం జోడించడంపై చైనా తీసుకున్న యూటర్న్ బిట్ కాయిన్‌కు షాక్ తగిలిగిందని అంటున్నారు. ఇంధనం ఇప్పుడు బిట్ కాయిన్‌కు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా పిలుస్తున్నారు. ఈ ప్రభావం బిట్ కాయిన్ పైన పడింది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఎప్పుడైనా అస్థిరతకు గురి కావొచ్చునని అంటున్నారు.

అన్నీ పతనం
బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పతనమయ్యాయి. ఎథేరియం, ఎక్స్ఆర్పీ, స్టెల్లార్ కూడా పడిపోయాయి. మధ్యాహ్నం సమయానికి ఎథేరియం 2,123.13 డాలర్లకు, ఎక్స్‌ఆర్పీ 1.28 డాలర్లకు, స్టెల్లార్ 0.488306 డాలర్లకు క్షీణించింది. కేవలం డోజీకాయిన్ మాత్రమే లాభపడింది. ఇది 22.63 శాతం లాభపడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications