Mutual Funds: జూన్‌లో మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేసిన స్టాక్స్ ఇవే..!
ఇదే సమయంలో ఇన్ఫోసిస్ లో రూ.1,494 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది, బజాజ్ ఆటోలో రూ.674 కోట్లు, టాటా స్టీల్ రూ.584 కోట్లు, జిందాల్ స్టీల్ రూ.419 కోట్లు, హిండాల్కో రూ.331 కోట్ల షేర్లను విక్రయించింది. రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్, వేదాంత ఆయిల్ & గ్యాస్, వేదాంత ఐరన్ & స్టీల్, జస్ట్ డయల్‌తో సహా 16 స్టాక్‌ల నుంచి ఈ ఫండ్ నిధులను పూర్తిగా ఉపసంహరించుకుంది. కోటక్ మ్యూచువల్ ఫండ్ జూన్‌లో బజాజ్ ఫైనాన్స్ లో రూ.1,085 కోట్లతో వాటాను పెంచుంకుంది. అజంతా ఫార్మాలో రూ.822 కోట్లు, మారుతి సుజుకి ఇండియాలో రూ.696 కోట్లు, ఎంకూర్ ఫార్మాస్యూటికల్స్ రూ.663 కోట్లు, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లో 618 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది బీఎస్ఈ లిమిటెడ్ , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, జీఈ వెర్నోవా టీ&డీ ఇండియా , ఎన్‌టీపీసీ, ఇండస్ టవర్స్ లలో తన వాటాలను తగ్గించుకుంది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ జూన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌పై తన పెట్టుబడులను రెట్టింపు చేసింది. తన వాటాను పెంచుకుంది. ఇది వేదాంత అల్యూమినియం మెటల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , టాటా స్టీల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటాను కొనగోలు చేసింది. లార్సెన్ & టూబ్రో, బజాజ్ ఆటో , వేదాంత ఆయిల్ & గ్యాస్, వేదాంత ఐరన్ & స్టీల్, ఐటిసి వాటాను తగ్గించుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో పాండీ ఆక్సైడ్స్ & కెమికల్స్, ఇండిక్యూబ్ స్పేసెస్, టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, సిఎమ్ఆర్ గ్రీన్ టెక్నాలజీస్ వంటివి ఉన్నాయి.

యాక్సిస్ ఎంఎఫ్ హెచ్‌డిఎఫ్‌సి లో వాటాను పెంచుంకుంది. ఇందులో రూ.1,076 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ , ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్ , చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ లో తన వాటాను పెంచుకుంది. ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా , హిండాల్కో , ఇన్ఫోసిస్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ (₹540 కోట్లు)లలో తన వాటాలను తగ్గించుకుంది. పి.ఎన్. గాడ్గిల్ జ్యువెలర్స్ ఈ ఫండ్ యొక్క ఏకైక కొత్త కొనుగోలు కాగా, వేదాంత ఆయిల్ & గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ & స్టీల్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా, మరియు ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియాల నుంచి పూర్తిగా వైదొలిగింది.
నిప్పన్ ఇండియా ఎంఎఫ్ జూన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది. ఇందులో తన వాటాను పెంచుకుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్ , ఏసిఎంఈ సోలార్ హోల్డింగ్స్ లలో వాటా పెంచుకుంది. జీఈ వెర్నోవా టీ&డీ ఇండియా, టాటా స్టీల్ , వరుణ్ బెవరేజెస్ , పవర్ ఫైనాన్స్ కార్ప్ , హిటాచీ ఎనర్జీ ఇండియాలో తన వాటాలను తగ్గించుకుంది. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, వినాటి ఆర్గానిక్స్‌ను కొత్తగా కొనుగోలు చేయగా, భారత్ కోకింగ్ కోల్, పి.ఎన్. గాడ్గిల్ జ్యువెలర్స్ నుంచి ఈ ఫండ్ పూర్తిగా నిష్క్రమించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications