Mutual Funds: లార్జ్ క్యాప్ ఫండ్లలోకి తగ్గిన పెట్టుబడులు.. స్మాల్ క్యాప్ ఫండ్లలోకి పెరిగిన నిధులు..
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గాయి. జూన్‌లోని రూ.28,961 కోట్లు ఉండగా.. అవి జూలై 2026లో 14.8% తగ్గి రూ.24,685 కోట్లకు చేరాయి. లార్జ్-క్యాప్, లార్జ్ & మిడ్-క్యాప్, ఫోకస్డ్, ఫ్లెక్సీ-క్యాప్, సెక్టోరల్/థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గాయి. లార్డ్ క్యాప్ ఫండ్లలోకి జూన్‌లో రూ.2,067.5 కోట్ల పెట్టుబడులు రాగా.. జూలైలో రూ.3,389.5 కోట్లు వచ్చాయి. అయితే జూలైలో లార్జ్-క్యాప్ ఫండ్ల నుంచి రూ.1,322 కోట్లు బయటకు వెళ్లాయి. డిసెంబర్ 2023 తర్వాత ఈ విభాగంలో భారీ విత్ డ్రా ఇదే మొదటిసారి.
ఇటీవలి నెలల్లో మిడ్, స్మాల్-క్యాప్ విభాగాలతో పోలిస్తే లార్జ్-క్యాప్ ఫండ్లు వెనుకబడటంతో విత్ డ్రా పెరిగినట్లు చెబుతున్నారు. ఈక్విటీ ప్రవాహాలు మొత్తం మీద మితంగా ఉన్నప్పటికీ స్మాల్-క్యాప్ ఫండ్లలోకి నిధులు పెరిగినప్పటికీ, లార్జ్-క్యాప్ ఫండ్ల నుండి రూ.1,300 కోట్ల నిధులు బయటకు వెళ్లడం ప్రత్యేకంగా నిలుస్తుందని మీరే అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ డిస్ట్రిబ్యూషన్ & స్ట్రాటజిక్ అలయన్సెస్ హెడ్ సురంజన బోర్తకుర్ అన్నారు. ఈక్విటీ పెట్టుబడులకు ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లు ప్రధాన గమ్యస్థానాలుగా నిలిచాయని పేర్కొన్నారు. కానీ ఈ జూన్‌లో ఫ్లెక్సీ క్యాప్ పండ్లలోకి రూ.5,231 కోట్లుగా పెట్టుబడులు రాగా.. జూలైలో రూ.4,709 కోట్లకు తగ్గింది. ఈ విభాగంలో పెట్టుబడులు దాదాపు 10 శాతం తగ్గాయి.
ఫోకస్డ్ ఫండ్లలో మరింత తీవ్రమైన క్షీణత నమోదైంది. జూన్‌లో రూ.1,118 కోట్లుగా ఉన్న నిధుల ప్రవాహం 42.6% తగ్గి రూ.642 కోట్లకు పడిపోయింది. లార్జ్ & మిడ్-క్యాప్ ఫండ్లలోకి నిధుల ప్రవాహం 20.7% తగ్గి, గత నెలలోని రూ.4,321 కోట్లతో పోలిస్తే రూ.3,425 కోట్లకు చేరింది. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లలోకి కూడా నిధుల ప్రవాహం తగ్గింది. ఈ విభాగం జూన్‌లోని రూ.1,469.3 కోట్లతో పోలిస్తే జూలైలో రూ.1,328.3 కోట్లకు తగ్గింది. అయితే స్మాల్ క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి.

స్మాల్ క్యాప్ పండ్లలోకి జూన్‌లో రూ.5,602 కోట్లు రాగా.. జూలైలో 38.7 శాతం పెరిగినరూ.7,767.5 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్-క్యాప్ ఫండ్లలో కూడా స్వల్ప పెరుగుదల నమోదైంది. వీటిలో పెట్టుబడుల ప్రవాహం రూ.6,090.2 కోట్ల నుంచి రూ.6,192 కోట్లకు పెరిగింది. మల్టీ-క్యాప్ ఫండ్లలో పెట్టుబడుల ప్రవాహం 5.1 శాతం పెరిగి రూ.3,070 కోట్ల నుంచి రూ.3,227 కోట్లకు చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications