Mutual Funds: జూలైలో అత్యధిక పెట్టుబడులు సాధించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..
జూలై నెలలో మొత్తం ఈక్విటీ ఫండ్ పెట్టుబడుల ప్రవాహం మందగించినప్పటికీ స్మాల్-క్యాప్ ఫండ్లకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ విభాగం జూన్‌లోని రూ. 5,602 కోట్ల నుంచి 39 శాతం పెరిగి జూలైలో రూ. 7,768 కోట్లకు చేరాయి. స్మాల్-క్యాప్ ఫండ్‌లు జనవరిలో రూ. 2,942 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 3,881 కోట్లు, మార్చిలో రూ. 6,264 కోట్లు అందుకున్నాయి. ఏప్రిల్‌లో పెట్టుబడుల ప్రవాహం రూ. 6,886 కోట్లకు పెరగగా, మేలో అది రూ. 4,946 కోట్లకు, జూన్‌లో రూ. 5,602 కోట్లకు తగ్గింది. జూలైలో రూ. 7,768 కోట్లకు చేరింది.
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ జూలై నెలలో రూ. 2,003 కోట్లను ఆకర్షించింది. ఇది స్మాల్-క్యాప్ ఫండ్లలో అత్యధికం. ఈ ఫండ్ పోర్టోఫోలియోలోకి సిటీ యూనియన్ బ్యాంక్, ఫినోలెక్స్ కేబుల్స్, జస్ట్ డయల్, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో సహా 15 స్టాక్‌లను చేర్చుకోగా, తొమ్మిదింటి నుంచి నిష్క్రమించింది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ తన పెట్టుబడులను విస్తృతంగా పంచుతూనే ఉంది. ఈ ఫండ్ పోర్ట్ ఫోలియోలో 260 స్టాక్స్ ఉన్నాయి. అందులో కేవలం 18.9 శాతం పోర్ట్‌ఫోలియో మాత్రమే దాని టాప్ 10 హోల్డింగ్స్‌లో ఉంది. దాదాపు 71 శాతం స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టింది.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో జూలైలో రూ. 1,374 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఫండ్ నాలుగు స్టాక్‌ల నుంచి నిష్క్రమించగా.. బంధన్ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, ఢిల్లీవెరీ, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కేపీఐటీ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్‌వేర్‌తో సహా 13 స్టాక్‌లను చేర్చుకుంది. క్వాంట్ 106 స్టాక్‌లను కలిగి ఉండగా, పోర్ట్‌ఫోలియోలో దాదాపు 36 శాతం దాని టాప్ 10 హోల్డింగ్స్‌లోనే ఉంది. పోర్ట్‌ఫోలియోలో సుమారు 65 శాతం స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టగా, నగదు వాటా 4.62 శాతంగా ఉంది.
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ లోకి జూలైలో రూ. 911 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్, స్విగ్గీతో సహా నాలుగు స్టాక్‌ల నుంచి ఈ ఫండ్ నిష్క్రమించింది. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, సింజీన్ ఇంటర్నేషనల్ అనే కేవలం రెండు స్టాక్‌లను మాత్రమే చేర్చుకుంది. ఈ ఫండ్ పోర్ట్ ఫోలియోలో కేవలం 65 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. టాప్ 10 స్టాక్‌లలో దాదాపు 36 శాతం వాటా ఉంది. పోర్ట్‌ఫోలియోలో దాదాపు 65.5 శాతం స్మాల్ క్యాప్స్ స్టాక్స్ ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications