Silver: కుప్పకూలిన వెండి ధర.. రూ.4 లక్షల నుంచి రూ.1.90 లక్షలకు పతనం..!
గతం కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. పసిడి ధరలు నిదానంగా తగ్గుతుండా వెండి ధరలు మాత్రం భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మొదట్లో కిలో వెండి రూ. 4 లక్షలకు చేరింది. 10 నెలల్లో కిలో వెండి రూ.1.90 లక్షలకు తగ్గింది. కిలో వెండి పై దాదాపు రూ.2.10 లక్షలు తగ్గింది. అంటే ధర 50 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. వెండి ఇలా ఎందుకు పడిపోతున్నాయని పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలతో పోల్చితే వెండి ధరల్లో ఓలాటైలిటీ ఎక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అందుకే లోహాలపై మీద పెట్టుబడి పెట్టేవారు బంగారం పై పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు.
వెండి ధర పతనానికి లాభాలా స్వీకరణ ఒక కారణంగా చెబుతున్నారు. వెండి ధరల పెరుగుతుందని ముందే అంచనా వేసిన వారు లాభాలు బుక్ చేసుకోవడం వల్ల వెండి ధరల్లో ఒత్తిడి పెరిగినట్లు చెబుతున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ లో మొన్నటి వరకు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇన్వెస్టర్లు. వెండి ధర పెరిగిన తర్వాత.. లాభాల స్వీకరణ మొదలుపెట్టడం ఈ పరిస్థితి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అధిక ధరలో వెండిని విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అయితే ఇక్కడ రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇవ్వడం వల్ల వారు నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు 2025 నుంచి ఊహించని విధంగా పెరిగాయి. సిల్వర్ అధిక వాల్యూయేషన్ లో ట్రేడవుతున్న క్రమంలో కరెక్షన్ వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే మొన్నటి వరకు అధిక పెట్టుబడుల వల్ల పెరిగిన వెండి ధర ఇప్పుడు వాస్తవ ధరకు దిగి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2027లో వెండి అంచనా వేసిన డిమాండ్ ను.. ఐదు శాతానికి తగ్గించడం కూడా ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. అంటే అంచనాల కంటే వెండి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా డాలర్ విలువ పెరగటం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న వార్తలు కూడా వెండి ధరలు పతనానికి కారణమయ్యాయి.
ఇండస్ట్రీయల్ సెక్టార్స్ అయిన సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం 3 శాతం తగ్గిందని. EV వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో వెండికి డిమాండ్ తగ్గిన్నట్లు చెబుతున్నారు. ధర పెరగటంతో సాధారణ కొనుగోళ్లు ఐదు శాతం తగ్గాయి. ఇదే క్రమంలోనే ఇండస్ట్రీయల్ వినియోగం 3 శాతం తగ్గింది. ఓవరాల్ గా వెండి డిమాండ్ 8 శాతం పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే ఏడాది అంటే 2027లోనూ వెండి డిమాండ్ అంచనాలకు మించి 5 శాతం తగ్గొచ్చన్న అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications