పసిడి.. మళ్లీ రూ.39 వేలకుపైన, వెండి ఒక్కరోజులోనే రూ.943 పెరిగి...
ఇటీవలి కాలంలో కాస్త దిగివచ్చిన బంగారం ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. పసిడి ధర మళ్లీ రూ.39 వేల పైస్థాయికి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రూ.191 పెరిగి.. 10 గ్రాముల బంగారం ధర రూ.39,239 పలికింది. మరోవైపు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రూ.943 పెరగడంతో కేజీ వెండ ధర ప్రస్తుతం రూ.47,146కు చేరుకుంది.
అటు ప్రపంచ మార్కెట్లో కూడా పసిడి ధరలు మంగళవారం 7వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతర ఒప్పందంపై ఆందోళనలు.. వెరసి పసిడి ధరలు మళ్లీ ఫ్యూచర్ మార్కెట్లో కూడా పైపైకి పోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6 డాలర్ల పెరిగి 1,495 స్థాయికి చేరింది. నవంబర్ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి.
ఇక ఈ నవంబర్‌లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్ అవుతోంది.
అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా సోమవారం మార్కెట్ ముగిసే సరికి రూ.266 లాభంతో రూ.38,257 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్ఛితి, ఆర్థిక మాంద్యం భయం.. నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు.
మరోవైపు క్రిస్మస్, కొత్త సంవత్సరం తదితర వేడుకల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరికొంత పుంజుకునే అవకాశం ఉందని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications