Hyderabad: ఇళ్ల విషయంలో తగ్గేదేలే అంటున్న హైదరాబాదీలు.. ఏం చేస్తున్నారంటే..!
Hyderabad Real Estate: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రభుత్వాలు మారటంతో దానికి తగినట్లుగానే రియల్ ఎస్టేట్ ధరలు కూడా మారిపోతున్నాయి. కరోనా తర్వాతి నుంచి సొంతిల్లు కలిగి ఉండాలనే కోరిక సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో కూడా భారీగానే పెరిగింది. దీంతో మెట్రో నగరాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి.
ప్రస్తుతం హైదరాబాదు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు పెట్టుబడిదామంగా మారింది. దీంతో అధిక స్థాయిలో ఐటీ, బ్యాంకింగ్, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. జీసీసీ కంపెనీలు సైతం తమ గ్రోబల్ కెపాసిటీ సెంటర్లను ఏర్పాటు చేయటంతో నగరంలో రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి. ఇది నగరంలో రియల్టీ వ్యాపారాన్ని పరిగెత్తిస్తోంది. తాజా డేటాను పరిశీలిస్తే.. హైదరాబాదులో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా ఏడాది ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

2024 డిసెంబరులో హైదరాబాదు రియల్టీ ప్రాపర్జీల రిజిస్ట్రేషన్లు 5,805గా నిలిచాయి. నెలవారీ ప్రాతిపదికన ఇది 5 శాతం వృద్ధిని సాధించింది. అయితే ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 20 శాతం తగ్గుదలను నమోదు చేశాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో డిసెంబరులో మెుత్తం అమ్మకాల విలువ పరంగా రూ.3,590 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో కూడా తన వృద్ధి పథాన్ని కొనసాగించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ వెల్లడించారు. హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన డిమాండ్, వృద్ధిని ప్రదర్శనను చూపింది.
ఈ క్రమంలో ప్రాపర్టీల అమ్మకాల సరళిని పరిశీలిస్తే.. రిజిస్ట్రేషన్లలో రూ.50 లక్షల కంటే తక్కువ విలువ కలిగిన గృహాలు 60% వాటా కలిగి ఉన్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య 2023లో 68 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రాపర్టీలు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గత ఏడాది మెుత్తం అమ్మకాల్లో వీటి వాటా 32 శాతంగా ఉండేది. మెజారిటీ ప్రాపర్టీలు 1000 నుంచి 2000 గజాల స్థలంలో నిర్మించబడిన గృహాలు కావటం గమనార్హం. వీటి కంటే పెద్ద ప్రాపర్టీలు కేవలం 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చాలా మంది కోటి రూపాయలకు పైగా ప్రాపర్టీల కొనుగోలుకు మెుగ్గుచూపినట్లు తేలింది.
2024లో మొత్తం హైదరాబాదు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు అత్యధికంగా 42 శాతం వాటాతో ముందు వరుసలో నిలిచాయి. దీని తర్వాత రంగారెడ్డి జిల్లా 41 శాతం, హైదరాబాద్ జిల్లా 17 శాతం కొనుగోళ్లతో టాప్ మూడు స్థానాల్లో కొనసాగాయి. అయితే డిసెంబరులో ఆశ్చర్యకరంగా సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగకపోవటం గమనార్హం. ఆస్తుల ధరల పెరుగుదల విషయానికి వస్తే మేడ్చల్-మల్కాజ్‌గిరి అత్యధికంగా ఏడాది ప్రతిపదికన 14 శాతం వృద్ధితో ముందు వరుసలో నిలిచాయి.


Click it and Unblock the Notifications