Small Cap Mutual Funds: నిప్పాన్, బంధన్, ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్లలోకి భారీగా నిధులు..
ఆగస్టులో కూడా స్మాల్-క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడిదారులను పెరిగాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లోకి అత్యధికంగా రూ. 2,187 కోట్ల పెట్టుబడులు రాగా.. దాని తర్వాత ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ లోకి రూ. 793 కోట్ల పెట్టుబడి వచ్చింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లోకి రూ. 757 కోట్ల పెట్టుబడి వచ్చింది. బంధన్, నిప్పన్ ఫండ్‌లు చెరో 250కి పైగా స్టాక్‌లను కలిగి ఉండగా, ఇన్వెస్కో కేవలం 70 స్టాక్‌లను మాత్రమే కలిగి ఉంది. బంధన్‌లో 13 శాతానికి పైగా నగదు ఉండగా ఇన్వెస్కో తన పోర్ట్‌ఫోలియోలో దాదాపు 35 శాతాన్ని తన టాప్ 10 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టింది.

బంధన్ స్మాల్ క్యాప్
మనీష్ గుణ్వానీ నిర్వహణలో ఉన్న బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లోకి ఆగస్టులో రూ. 2,187 కోట్ల పెట్టుబడి వచ్చాయి. ఇది స్మాల్-క్యాప్ పథకాలలో అత్యధికం. దీని AUM జూలైలో రూ. 31,103 కోట్ల నుంచి ఆగస్టులో రూ. 34,176 కోట్లకు పెరిగింది. ఈ ఫండ్ 258 ఈక్విటీ స్టాక్‌లను కలిగి ఉంది. ఇది నిప్పన్ యొక్క 254-స్టాక్ పోర్ట్‌ఫోలియోతో పాటు మూడింటిలో అత్యంత వైవిధ్యభరితమైనదిగా నిలిచింది. దీని టాప్ 10 హోల్డింగ్స్ వాటా కేవలం 17.87 శాతంగా ఉంది, స్మాల్-క్యాప్ కేటగిరీ సగటు 25.52 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
బంధన్ ఫండ్‌లో 13.32 శాతం నగదు ఉంది. ఇది కేటగిరీ సగటు 5.29 శాతం కంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఇందులో మరో 68.75 శాతం స్మాల్ క్యాప్స్‌లో, 10.73 శాతం మిడ్ క్యాప్స్‌లో 6.08 శాతం లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడిగా ఉన్నాయి. ఈ ఫండ్ ఆగస్టు నెలలో నాలుగు స్టాక్‌లను చేర్చుకోగా, ఆరింటి నుంచి పూర్తిగా నిష్క్రమించింది. లలితా జ్యువెలరీ మార్ట్ దాదాపు 0.49 శాతంతో అతిపెద్ద కొత్త పొజిషన్‌గా నిలిచింది. బంధన్ సంస్థ TBO టెక్, పాలి మెడిక్యూర్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, లుమాక్స్ ఆటో టెక్నాలజీస్, సిటీ యూనియన్ బ్యాంక్, బజార్ స్టైల్ రిటైల్ సంస్థల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈ ఫండ్ ఒక సంవత్సరంలో 11.78 శాతం, మూడు సంవత్సరాలలో 23.01 శాతం రాబడిని ఇచ్చింది.
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్
తాహెర్ బాద్షా నిర్వహణలో ఉన్న ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ ఆగస్టు నెలలో దాదాపు రూ. 793 కోట్లు సమీకరించింది. దీంతో దాని AUM (ఆస్తుల నిర్వహణ) రూ. 14,475 కోట్ల నుంచి రూ. 15,744 కోట్లకు పెరిగింది. దీని పోర్ట్‌ఫోలియో బంధన్ ఫండ్ పోర్ట్‌ఫోలియో కంటే చాలా భిన్నంగా ఉంది. బంధన్ వద్ద 258, నిప్పన్ వద్ద 254 స్టాక్స్ ఉండగా, ఇన్వెస్కో వద్ద 70 స్టాక్స్ ఉన్నాయి. ఫలితంగా, దీని టాప్ 10 హోల్డింగ్స్ పోర్ట్‌ఫోలియోలో 34.88 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది కేటగిరీ సగటు అయిన 25.52 శాతం కంటే చాలా ఎక్కువ. ఈ ఫండ్‌లో 65.68 శాతం స్మాల్ క్యాప్స్‌లో, 14 శాతం మిడ్ క్యాప్స్, 13.18 శాతం లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టింది.ఇన్వెస్కో ఆగస్టు నెలలో ఐదు కొత్త స్టాక్‌లను చేర్చుకుంది. వీటిలో మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. ఇది నెలాఖరు నాటికి పోర్ట్‌ఫోలియోలో 1.70 శాతం వాటాను కలిగి ఉంది. గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ 0.65 శాతంతో మరో కొత్త స్థానంగా ఉండగా, ఫోసెకో ఇండియా 0.49 శాతంతో ఉంది.
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఆగస్టులో రూ. 757 కోట్ల పెట్టుబడులు అందుకుంది. దీని AUM రూ. 78,957 కోట్ల నుంచి రూ. 82,580 కోట్లకు పెరిగింది. దీంతో ఇది మిగతా రెండు ఫండ్‌ల కంటే గణనీయంగా పెద్దదిగా మారింది. సమీర్ రాచ్ నిర్వహణలో ఉన్న ఈ ఫండ్‌లో 254 స్టాక్‌లు ఉన్నాయి, కానీ దాని టాప్ 10 స్టాక్‌లు పోర్ట్‌ఫోలియోలో కేవలం 14.49 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. ఇది ఈ మూడింటిలో అత్యల్ప వాటా, కేటగిరీ సగటు కంటే గణనీయంగా తక్కువ. దీని మార్కెట్-క్యాప్ కేటాయింపు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. 69.22 శాతం స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టగా, ఈ ఫండ్ లార్జ్ క్యాప్స్‌లో 14.21 శాతం వాటాను కలిగి ఉంది. నిప్పన్ ఆగస్టులో ఆరు కొత్త స్టాక్‌లను చేర్చుకుని, మూడింటి నుంచి పూర్తిగా నిష్క్రమించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
