Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. అనంతపురం, గుంతకల్లులో ఆగనున్న ట్రైన్..!
బెంగళూరు, ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ నేటి నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలు రెండు రైలు నంబర్లతో నడవనుంది. 27652 (SMVT బెంగళూరు - CSMT ముంబై), 27651 (CSMT ముంబై - SMVT బెంగళూరు). ఈ రైళ్లు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు-ముంబై సర్వీసు సోమవారాల్లో ముంబై-బెంగళూరు సర్వీసు మంగళవారాల్లో నడవవు. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 16 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం రైలు నంబర్ 27652 సాయంత్రం 7:45 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు CSMT ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 రాత్రి 8:10 గంటలకు CSMT ముంబై నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ అనే ఎనిమిది స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు-ముంబై ప్రయాణంలో మధ్యంతర స్టేషన్లలో రైలు రాక, బయలుదేరే సమయాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం రైల్వే స్టేషన్ కు రాత్రి 10:28 చేరుకుని 2 నిమిషాలు ఆగిన తర్వాత 10:30 గంటలకు బయల్దేరుతుంది. గుంతకల్లుకు రాత్రి 11:20 చేరుకుని, 11:25 గంటలకు బయల్దేరుతుంది. రాయచూరుకు తెల్లవారుజామున 1:03 చేరుకుని 1:05 బయల్దేరుతుంది. యాద్గిర్ కు తెల్లవారుజామున 1:43 చేరుకుని, 1:45 బయల్దేరుతుంది. కలబురగికి తెల్లవారుజామున 3:08 చేరుకుని 3:10 బయల్దేరుతుంది. సోలాపూర్ కు తెల్లవారుజామున 4:20 చేరుకుని 4:25 బయల్దేరుతుంది. పూణే కు ఉదయం 8:00 చేరుకుని 8:05 బయల్దేరుతుంది. కళ్యాణ్ కు ఉదయం 10:42 కు చేరుకుని 10:44 బయల్దేరుతుంది.
ముంబై నుంచి బెంగళూరుకు తిరుగు ప్రయాణంలో ఈ రైలు కళ్యాణ్ కు రాత్రి 8:48 చేరుకుని 8:50 బయల్దేరుతుంది. పూణేకు రాత్రి 11:40 చేరుకుని 11:45 బయల్దేరుతుంది. సోలాపూర్ కు తెల్లవారుజామున 3:00 చేరుకుని 3:05 బయల్దేరుతుంది. కలబురగికి తెల్లవారుజామున 4:13 చేరుకుని 4:15 బయల్దేరుతుంది. యాద్గిర్ కు తెల్లవారుజామున 5:08 చేరుకుని 5:10 బయల్దేరుతుంది. రాయచూరుకు ఉదయం 6:03 చేరుకుని 6:05 బయల్దేరుతుంది. గుంతకల్లుకు ఉదయం 7:30 చేరుకుని 7:35 బయల్దేరుతుంది. అనంతపురానికి ఉదయం 8:38 చేరుకుని 8:40 బయల్దేరుతుంది. ఈ రైలులో ఏసీ 3-టైర్ , ఏసీ 2-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ మూడు తరగతుల వసతులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 3-టైర్‌కు రూ. 2,810, ఏసీ 2-టైర్‌కు రూ. 3,630, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ. 4,450 ధరలు నిర్ణయించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications