Tirumala Laddu Row: తిరుమల అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఉన్న వేంకటేశ్వరును భక్తుడికైనా గుర్తొచ్చేది లడ్డు. స్వామిని దర్శించినప్పుడు వారు పొందే తృప్తి ప్రసాదం స్వీకరించటంతో ముగుస్తుంది. చాలా మంది దీనిని కేవలం ప్రసాదంగా మాత్రమే కాకుండా చాలా పవిత్రతో చూస్తుంటారు. గత ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఏపీ సర్కార్ సంచలన విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే.
దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కేవలం రాజకీయంగా, ఆధ్యాత్మికంగానే కాకుండా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంది. లడ్డు తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై చెబుతున్న వివరణ ఒకలా ఉండే కూటమి ప్రభుత్వ ఆరోపణలు మరోలా ఉండటంతో వాస్తవాను నిగ్గుతేల్చటానికి కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశించిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంలో సీబీఐకి చెందిన ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారులతో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి నియమించబడ్డారు.

విషయాన్ని కొంచెం డీప్‌గా దర్యాప్తు చేయగా ఈ వ్యవహారంలో నెయ్యి సరఫరాదారైన ఏఆర్ డెయిరీ తప్పులు బయటపడ్డాయి. లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి సరఫరాను తక్కువ రేటు కోట్ చేసి టెండర్ దక్కించుకున్న సంస్థ.. దానిని బోలే బాబా డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించాయి. దీనికి సంబంధించిన టాక్స్ అధికారులు వే బిల్లులు, జీఎస్టీ రసీదులు, టోల్ గేట్‌ల నుంచి ఆధారాలు కలెక్ట్ చేశారు. ఈ వ్యవహారంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఏఆర్ డెయిరీ కొంటున్న ధర కంటే తక్కువ రేటుకే దానిని తిరిగి టీటీడీకి సరఫరా చేయటం. దీనిని చూసినవాళ్లందరూ ఇదెలా సాధ్యంరా బాబు అని నివ్వెరపోయారు. ఇక్కడ టీటీడికి కేజీ నెయ్యిని రూ.318 చొప్పున అందించేందుకు ఏఆర్ డెయిరీ టెండర్ దక్కించుకుంది. అయితే సదరు నెయ్యిని బోలేబాబా, వైష్ణవీ డెయిరీల నుంచి కేజీకి రూ.355 చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.
అయితే గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆదేవదేవుడికి వాడే నెయ్యి విషయంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదని, పూర్తిగా క్వాలిటీ పరీక్షల తర్వాతే నెయ్యిని వినియోగించినట్లు పేర్కొంది. జంతువుల కొవ్వు, పంది కొవ్వు లాంటి కలిపినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. చాలా సార్లు నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపినట్లు సైతం అప్పటి అధికారులు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై కూటమి ప్రభుత్వంలో డిప్యుటీ సీఎంగా ఉన్న పవర్ కళ్యాణ్ దీనిపై ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు మెుత్తం మీద టీటీడీతో పాటు ప్రభుత్వ పెద్దలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి నమ్మకాన్ని మసకబార్చాయి. అయితే ప్రస్తుతం ఏపీ సర్కార్ నెయ్యి టెండర్లను గతంలో సరఫరాదారు అయిన నందిని నెయ్యికి తిరిగి ఇవ్వటంతో ప్రస్తుతం నెయ్యి క్వాలిటీ, రుచి మెరుగుపడిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు టీటీడీ ఆదాయంపై కూడా కొంత మేర ప్రభావం కలిగించి ఉంటాయని నిపుణులు అంచనా వేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications