నిమిషానికి 95 బిర్యానీలు ఆర్డర్, వెజ్ పిజ్జాలకే మొగ్గు: 2019 టాప్ డిషెస్ ఇవే!

గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లకు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. దీంతో ఆర్డర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఉదయం టిఫిన్ నుంచి మొదలు రాత్రి డిన్నర్ వరకు ఎక్కువమంది ఫుడ్ డెలివరీ యాప్స్ మీదనే ఆధారపడుతున్నారు. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది (2019) ఎక్కువమంది ఇష్టపడిన ఫుడ్ బిర్యానీ అని స్విగ్గీ తెలిపింది.

నిమిషానికి 95 బిర్యానీలు

నిమిషానికి 95 బిర్యానీలు

భారతీయులు స్విగ్గీలో ఆర్డర్ చేసిన దాని ప్రకారం ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు లేదా సెకనుకు 1.6 బిర్యానీలు కొనుగోలు చేశారు. అంతేకాదు, ఫుడ్ డెలివరీ యాప్ కొత్తగా ఉపయోగించడం ప్రారంభించిన వారు కూడా మొదట ఎక్కువమంది బిర్యానీనే ఆర్డర్ చేశారు.

కిచిడీకి పెరిగిన డిమాండ్

కిచిడీకి పెరిగిన డిమాండ్

వరుసగా మూడో ఏడాదిలో కూడా భారతీయులు (ఆన్‌లైన్ ఆర్డర్) ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో బిర్యానీ టాప్‌లో ఉంది. బిర్యానీ టాప్‌లో నిలిచినప్పటికీ కిచిడీకి మాత్రం ఈ ఏడాది డిమాండ్ క్రమంగా పెరిగింది. ఈ ఏడాదిలో స్విగ్గీలో కిచిడీకి ఆర్డర్స్ ఏకంగా 128 శాతం పెరిగాయి.

వెజ్ పిజ్జాలకు డిమాండ్

వెజ్ పిజ్జాలకు డిమాండ్

ఆర్డర్స్ చేసేవారు ఎక్కువగా చికెన్ బిర్యానీని ప్రిఫర్ చేస్తున్నారని, అలాగే పిజ్జాలు ఆర్డర్ చేసేవారిలో ఎక్కువగా వెజ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా చీజ్, ఆనియన్, పనీర్, ఎక్స్ట్రా చీజ్, ముష్రూమ్, క్యాప్సికమ్, కార్న్, జాలాపీనోస్, ఆలివ్ పిజ్జాలకు ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయని స్విగ్గీ పేర్కొంది. పైనాపిల్‌కు కాస్త తక్కువ ఆదరణ ఉన్నట్లు తెలిపింది. పిజ్జా ఆర్డర్లలో దీని డిమాండ్ కేవలం 1.5 శాతమేనని పేర్కొంది.

స్వీట్స్ అండ్ ఐస్‌క్రీమ్స్

స్వీట్స్ అండ్ ఐస్‌క్రీమ్స్

గులాబ్ జామూన్, మూంగ్ దాల్ హల్వా వంటి స్వీట్స్‌కు కూడా డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. 2019లో 17,69,399 గులాబ్ జామూన్ ఆర్డర్స్ ఉండగా, 2,00,301 హల్వా ఆర్డర్స్ వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫలుడాకు డిమాండ్ భారీగా పెరిగిందని, 11,94,732 తో టాప్ డిజర్ట్స్‌‌లో నిలిచిందని తెలిపింది. ముంబైలో ఐస్‌క్రీమ్ ఫిల్డ్ ఫలుడాల ఆర్డర్లు 6,000కు పైగా పెరిగాయి. చండీగడ్‌లో చాకో పీ అండ్ డ్రింక్‌కు 79,242 ఆర్డర్స్ వచ్చాయి.

ఈ ఏడాది టాప్ డిషెస్ ఇవే..

ఈ ఏడాది టాప్ డిషెస్ ఇవే..

మొత్తంగా 2019లో ఎక్కువగా ఇష్టపడిన లేదా ఎక్కువగా ఆర్డర్ చేసిన డిష్‌లలో చికెన్ బిర్యానీ, మసాలా దోష, పన్నీర్ బట్టర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరీ చికెన్, దాల్ మఖాని ఉన్నాయి.

306 శాతం పెరిగిన ఆన్‌లైన్ వినియోగం

306 శాతం పెరిగిన ఆన్‌లైన్ వినియోగం

దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్నెట్, యాప్స్ వినియోగించే వారి సంఖ్య 306 శాతం పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బిర్యానీతో పాటు గులాబ్ జామూన్ ఇష్టంగా తింటున్నారు. డెంగీ జ్వరం సమయంలో బొప్పాయి ఆకులు డెలివరీ చేసినట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+