Gold Price: ఒకప్పుడు బంగారం తులానికి రూ.63.25 ఉండేది..!
బంగారం ధర గత రెండు సంవత్సరాలు పెరుగుతోంది. ముఖ్యంగా సంవత్సరం కాలంగా పసిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,130కు చేరింది. ఇక 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,42,200 వద్ద కొనసాగుతుండగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,350 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలహీనపడడంతో పుత్తడి ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇటు దేశీయంగా బంగారానికి భారీ డిమాండ్ కొనసాగుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అంతే కాకుండా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషిస్తున్నారు.
అయితే భారతీయులకు ఎప్పటి నుంచో బంగారం అంటే ఇష్టం. ముఖ్యంగా మహిళలకు పసిడిని చాలా ఇష్టపడతారు. పెళ్లిళ్ల సమయంలో భారీగా ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పుడు రూ.1.50 లక్షలు ఉన్న బంగారం ధర ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉండేది. 1947లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88.62 మాత్రమే ఉంది.
80 ఏళ్ల తర్వాతే అదే 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే ఈ 80 సంవత్సరాల్లో బంగారం 1711 రెట్లు పెరిగింది. అంటే భారీ లాభాన్ని అందించింది.

అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట. అయితే బంగారం ధర ఒక్కసారి భారీగా పెరగలేదు. క్రమక్రమంగా పెరిగింది. 80 ఏళ్లలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో తులం బంగారం ధర రూ. 99.18 చేరింది. తరువాత 1964లో 10 గ్రాముల పసిడి ధర రూ.63.25కు తగ్గింది. ఆ తర్వాత బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక వేళ మీరు 1947లో రూ. 5,000 బంగారం కొనుగోలు చేస్తే.. ఇప్పుడు దాని విలువ భారీగా పెరిగింది. మీరు అప్పుడు 10 గ్రాములకు రూ.88.62 కొనుగోలు చేస్తే మీకు 56 తులాలు వస్తుంది. ఇప్పుడు అదే 56 తులల విలువ రూ.75 లక్షలకు పైనే ఉంది.
80 ఏళ్ల క్రితం రూ.5000 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.75 లక్షలకు చేరింది. ఈ కాలంలో పసిడి 1726 రెట్లు పెరిగింది. అయితే భారతీయులు ఎప్పటి నుంచో బంగారం కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇండియన్స్ ఇళ్లలో వేల టన్నుల బంగారం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications