నేడు మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడో సెషన్‌లో పెరుగుదలను కొనసాగించాయి. తరువాత కొద్దీసేపటికి సెన్సెక్స్, నిఫ్టీ డీలా పడిపోయి రెడ్ మార్కులోకి చేరాయి. షేర్ మార్కెట్ ఒక విధంగా తిరిగి కోలుకునే దశలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఎలా ముగుస్తుందో చూడాల్సిందే. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ప్రస్తుతం లాభాలు పండిస్తున్నాయి.
ఈ రోజుల్లో పెట్టుబడిదారులు వారి పెట్టుబడులపై మంచి రాబడిని పొందుతుండగా, కొంతమంది అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు కూడా పెరుగుతున్న స్టాక్ మార్కెట్‌లో భారీగా సంపాదిస్తున్నారు. వీరిలో రేఖా ఝున్‌జున్‌వాలా టాప్ లో ఉన్నారు. రేఖా ఝున్‌జున్‌వాలా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అలాగే రాకేష్ ఝున్‌జున్‌వాలా భార్య.

కేవలం 10 నిమిషాల్లోనే కోట్లు
టాప్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరైన రేఖా జున్‌జున్‌వాలా ఆమె రెండు పోర్ట్‌ఫోలియో స్టాక్‌లు టైటాన్ కంపెనీ అండ్ మెట్రో బ్రాండ్‌ల ద్వారా 10 నిమిషాల్లో రూ.105 కోట్ల కంటే పైగా పొందారు. ఈరోజు NSEలో టైటాన్ షేరు మొదటి పది నిమిషాల్లో ఒక్కో షేరు రూ.20.90 పెరిగింది, అయితే ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన మొదటి పది నిమిషాల్లో మెట్రో బ్రాండ్స్ షేర్ ధర కూడా ఒక్కో షేరుకు రూ.3.90 పెరిగింది.
రూ.105 కోట్లు
టైటాన్ షేరు ధర ఈరోజు NSEలో ఒక్కో షేరు రూ. 3,310తో ప్రారంభమై రూ.3,360 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మొదటి పది నిమిషాల్లో ఒక్కో షేరు రూ.20.90 పెరిగింది. అలాగే మెట్రో బ్రాండ్‌ల షేర్లు ఈరోజు NSEలో ఒక్కో షేరుకు రూ1,177.10 వద్ద ప్రారంభమై పది నిమిషాల్లో రూ.1,180.95కి చేరాయి, దింతో ఒక్కో షేరు రూ.3.90 పెరిగింది. అయితే, ప్రాఫిట్-బుకింగ్ తర్వాత స్టాక్ అధిక స్థాయిలను కొనసాగించడంలో విఫలమైంది.
జూలై నుండి సెప్టెంబర్ 2024 వరకు టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ పాలసీ ప్రకారం రేఖా జున్‌జున్‌వాలా 4,57,13,470 టైటాన్ షేర్లు ఉన్నాయి. టైటాన్ షేర్ల పెరుగుదల కారణంగా రేఖా జున్‌జున్‌వాలా సంపద మొదటి పది నిమిషాల్లో రూ.95.54 కోట్లు పెరిగింది. అదేవిధంగా కంపెనీ క్యూ2ఎఫ్‌వై25 షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్‌లో రేఖ జున్‌జున్‌వాలాకి 2,61,02,394 మెట్రో బ్రాండ్స్ షేర్లు ఉన్నాయి. మెట్రో బ్రాండ్ మార్కెట్ క్యాప్ రూ.31,946 కోట్లు. అలాగే టైటాన్ మార్కెట్ క్యాప్ రూ.2,93,791 కోట్లు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications