IMF: కరోనా అనంతరం ఏర్పడిన ఆర్థిక మందగమనంతో దాదాపు ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఇండియా మాత్రం వృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతోంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అహర్నిశలూ శ్రమిస్తోంది.
'డిజిటలైజేషన్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలలో భారత్ పటిష్టమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. దీంతో భారీ వృద్ధి రేటుతో ఇండియా ఒక స్టార్ పెర్ఫార్మర్‌గా అవతరించింది. ప్రపంచ వృద్ధికి 16 శాతానికి పైగా సహకారం అందించగలదని అంచనా వేస్తున్నాం' అని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది.

'కొంత కాలంగా భారత్ చాలా బలమైన రేటుతో అభివృద్ధి చెందుతోంది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు నిజమైన వృద్ధితో స్టార్ పెర్ఫార్మర్‌గా అవతరించింది. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, వృద్ధికి ఆస్కారమున్న లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ పట్ల ప్రభుత్వం నిబద్ధత కలిగి ఉంది' అని IMFలోని మిషన్ ఆఫ్ ఇండియా నాదా చౌయిరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇండియాతో IMF వార్షిక ఆర్టికల్ IV సంప్రదింపులను ఆయన విడుదల చేశారు. దాని ప్రకారం భారత్ వివేకవంతమైన స్థూల ఆర్థిక విధానాల ద్వారా మంచి ట్రాక్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఇండియా ఒకటిగా నిలిచినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications