IMF: బడ్జెట్ సహా దేశ ఆర్థికంపై IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
Budget 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బడ్జెట్ ప్రవేశపెట్టే అంకం పూర్తైంది. గతంలో మాదిరిగా కాకుండే కేవలం గంట వ్యవధిలోనే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. అయితే దీని ప్రారంభానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థపై IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశావహ కామెంట్స్ చేశారు.
కొవిడ్-19 ప్రభావాన్ని ఇండియా పూర్తిగా అధిగమించినట్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు భారత ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కెవి సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయా దేశాలు చేసిన ఖర్చు వల్ల ద్రవ్యోల్బణ సమస్య ఏర్పడినట్లు గుర్తుచేశారు. దీనికితోడు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల గ్లోబల్ ఎకానమీ ఇంకా కోలుకోలేదన్నారు. అయితే ఇండియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు చెప్పారు.

2024-25 బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ కనుక పెద్దమొత్తంలో మార్పులు ఉండకపోవచ్చన్నారు. 7.3 శాతం వృద్ధి రేటుకు అవకాశంతో ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు అనుసరించిన విధానాలవైపే మొగ్గుచూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మహిళల కోసం ఏవైనా చర్యలు తీసుకుంటే బావుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'రాబోయే రోజుల్లో ధరలు దిగి రావచ్చు. ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతోంది. కరెంట్ ఖాతా లోటు మంచి స్థితిలో ఉంది. ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది. కాబట్టి మహమ్మారి ప్రభావం నుంచి భారత్ పూర్తిగా బయటపడింది అనడంలో సందేహం లేదు' అని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు కూడా 7 శాతం కంటే ఎక్కువగా నమోదుకానున్నట్లు తెలిపారు. మూలధన వ్యయం దాదాపు 3.5 శాతం పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications