కరోనాతో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల దెబ్బతో అంతర్జాతీయ సమాజం అనిశ్చితిలో కూరుకుపోయింది. దీంతో అగ్ర రాజ్యాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు చతికిల పడ్డాయి. కానీ మరికొన్ని మాత్రం వీటిని ఏ మాత్రం లెక్కచేయకుండా వృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
2024లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) అవుట్ లుక్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 2023లో విడుదలైన దాని వరల్డ్ ఎకనామిక్ డేటా ఆధారంగా.. ఆయా దేశాల GDP వృద్ధిని అంచనా వేయొచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా దేశాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో 27.2 శాతం వృద్ధి రేటుతో మకావో ముందు వరుసలో ఉంది. గుయానా 26.6, పలావు 12.4, నైగర్ 11.1, సెనెగల్ 8.8 శాతంతో తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక వరల్డ్ ఎకానమీలో బ్రైట్ స్పాట్ గా చెప్పబడుతున్న భారత్ 6.3 శాతం అంచనా రేటుతో ఈ లిస్టులో 11వ స్థానాన్ని ఆక్రమించింది.
మకావో ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే కీలకం. 60 శాతం ఉద్యోగాలకు ఇదే ఆధారం. GDPలో ఈ రంగం వాటా దాదాపు 70 శాతం. పలావు 340 ద్వీపాలతో కూడిన చిన్న దేశం. GDPలో దాదాపు 40 శాతానికి పర్యాటకం ప్రాతినిధ్యం వహిస్తోంది. నైజర్, సెనెగల్ పూర్తిగా చమురుపై ఆధారపడినవే. కాగా జనాభా పరంగా అతిపెద్ద దేశంగా అవతరించిన భారత్.. 2064 నాటికి 1.7 బిలియన్ల మందిని కలిగి ఉంటుందని అంచనా. ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications