Bengaluru News: మెున్ననే శివరాత్రి ముగిసిందే. కానీ దీనిని కొద్ది రోజుల ముందు నుంచే వేసవి తాపం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా అనేక మెట్లో నగరాల్లో భానుడి భగభగలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో పనిచేస్తున్న తెలుగు టెక్కీల ఫ్యామిలీలు రానున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కునే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
ఈ సమయంలోనే భారత వాతావరణ సంస్థ చల్లటి వార్త చెల్లింది. ఫిబ్రవరిలోనే ముందుగా వేసవి ప్రారంభమైన వేళ అధిక ఎండ వేడిమితో పాటు భారీ వర్షాలు కూడా కర్ణాటకను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో నగరంతో పాటు దక్షిణ కర్ణాటకలో రుతుపవనాల ఎంట్రీతో ముందుగానే వర్షాలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలు తీవ్రమైన వేడిగాలుల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది.

వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం బెంగళూరుతో పాటు ఇతర జిల్లాల్లో ఎండ వేడిమి మార్చి-మే నెలల మధ్య కాలంలో 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుందని పేర్కొంది. అలాగే ముందుగానే అధిక వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. దీని ప్రకారం బెంగళూరులో నివసిస్తున్న ప్రజలకు వేసవి కొంత ముందే ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా ఎండల నుంచి తప్పించుకోవటంతో పాటుగా నీటి ఎద్దడి సమస్యలు కూడా తక్కువ కాలం వేధించే అవకాశం ఉందని నగరంలోని ప్రజలు భావిస్తున్నారు. ఇకపోతే కర్ణాటక తీరప్రాంతంతో పాటు మల్నాడ్ ప్రాంతంలో ఎండలు 50-60 డిగ్రీల మధ్య దంచికొట్టనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఇదే క్రమంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ రాత్రిళ్లు వేడిగా ఉంటాయని అధికారులు చెప్పారు. ఇది సాధారణంగా ఉండే పద్దతికి పూర్తిగా విరుద్ధం కావటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎండవాతావరణం నుంచి రిలీఫ్ పొందటానికి ప్రజలు రోజు మెుత్తం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు నేరుగా సూర్యుడి నుంచి రక్షణకోసం చర్మాన్ని పూర్తిగా కప్పిఉంచే బట్టలు వేసుకోవాలని, మధ్యాహ్నం ఎండ సమయాల్లో బయటకు వెళ్లటం తగ్గించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అయితే ప్రజలు ఈ క్రమంలో తాగు నీటిని కార్ వాషింగ్, గార్డెనింగ్ సహా ఇతర అవసరాలకు వృధా చేయెుద్దని నిషేధాజ్ఞలు జారీ చేసింది. నీటిని వృధా చేసినందుకు రూ.5,000 జరిమానా విధించింది. ఈ నియమాన్ని పాటించనివారిపై ఇటీవల 112 కేసులు నమోదు చేసి దాదాపు రూ.5.6 లక్షలు వసూలు చేసినట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. వేసవి తీవ్రమయ్యే ఏప్రిల్ మరియు మే నెలల్లో పరిస్థితిని పరిష్కరించడానికి బోర్డు చర్యలు తీసుకుంటుండగా బోర్‌వెల్స్‌లో.. ముఖ్యంగా బయటి ప్రాంతాలలో నీరు తగ్గిపోవడంపై నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కువగా ప్రైవేటు వాటర్ ట్యాంకుల దయపై ఆధారపడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications