Summer Stocks: వాతావరణ శాఖ వార్నింగ్.. లాభపడనున్న 4 షేర్లు ఇవే.. మీ దగ్గర ఉన్నాయా..?

Investment Ideas: దేశంలో వేసవి కాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభంలోనే వేడిమి, వడగాలులతో భానుడి ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికను జారీ చేసింది. అయితే హీట్ వేవ్ గురించి వార్తలు కొన్ని షేర్లకు వరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సైతం పెరుగుతున్న ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్‌లకు డిమాండ్‌ పెరగడంతో పాటు వాటిని తయారు చేసే కంపెనీల షేర్లు కూడా పెరుగుతాయి. బ్రోకరేజ్ సంస్థ మెహతా ఈక్విటీస్ ఈ వేసవి సీజన్‌లో కొనుగోలు చేయడానికి నాలుగు స్టాక్‌లను ఇన్వెస్టర్లకు సూచించారు. జూన్ వరకు వేసవి మంటలు కొనసాగుతాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.

IMD Heatwave Alert triggers rise in 4 stocks as mehatha equity brokerage suggests

సింఫనీ స్టాక్..
ముందుగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనేది కూలర్లు. వీటి తయారీలో ఇప్పటికే సింఫనీ పెద్ద పేరుగాంచింది. ఈ క్రమంలో సింఫనీ షేరు నేడు లాభంతో రూ.954.40 వద్ద ట్రేడవుతోంది. స్టాక్ కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్లలో 11% జంప్ చేసింది. సాంకేతికంగా గడచిన 2-3 ఏళ్లుగా స్టాక్ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. ప్రతికూల ప్రమాదం 962 వద్ద చాలా పరిమితంగా ఉందని బ్రోకరేజ్ అంచనా వేసింది. అలాగే రూ.800 సపోర్ట్ ధరగా ఉంటున్నారు. రానున్న కాలంలో షేర్ ధర రూ.1200 నుంచి రూ.1500 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

బజాజ్ ఎలక్ట్రికల్స్‌ స్టాక్..
బజాజ్ ఎలక్ట్రికల్స్ దాని వీక్లీ చార్ట్‌లో ట్రెండ్‌లైన్ సపోర్ట్ మార్క్ 900 దగ్గర ట్రేడవుతోంది. 875 నుంచి 900 జోన్ వైపు ఏదైనా కదలిక స్టాక్‌పై మంచి కొనుగోలు అవకాశంగా చూడాలి. ఇందులో వీక్లీ స్టాప్ లాస్‌ను 840 కంటే కొంచెం దిగువన ఉంచుకోవాలని సూచించింది. రానున్న కాలంలో స్టాక్ టార్గెట్ ధర రూ.1,200 చేరుకుంటుందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

వోల్టాస్ స్టాక్..
టాటాలకు చెందిన ఏసీలు, కూలర్లు తయారు చేసే సంస్థ వోల్టాస్. వేసవిలో ప్రజలు ఎక్కువగా ఏసీలు కొనుగోలు చేసేందుకు మెుగ్గుచూపుతున్న వేళ ఈ కంపెనీ షేర్లు సైతం లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలి రెసిస్టెన్స్ మార్క్ రూ.1,139.60 వద్ద మంచి బ్రేక్‌అవుట్‌ని ఇచ్చింది. బలమైన పెరుగుదలకు సిద్ధంగా ఉన్నందున స్టాక్ ధర రానున్న కాలంలో రూ.1,356 స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ ఒక శాతం పెరిగి రూ.1,202.70 వద్ద ట్రేడవుతోంది. అలాగే గడచిన 5 రోజుల్లో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా పెరిగాయి.

బ్లూ స్టార్ స్టాక్..
దేశంలో కూలింగ్ గృహోపకరణాల తయారీ రంగంలో ఉన్న మరో కంపెనీ బ్లూస్టార్. సాంకేతికంగా స్టాక్ దాని రూ.1,220 నుంచి రూ.1,359 పరిధిలో బాగా కన్సాలిడేట్ అవుతోంది. 1250-1260 వద్ద ఏదైనా క్షీణత స్టాక్‌పై మంచి కొనుగోలు అవకాశమని బ్రోకరేజ్ వెల్లడించింది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.1500-1600 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లలో అప్ ట్రెండ్ ర్యాలీ కొనసాగుతుండగా నేడు స్టాక్ 1 శాతం మేర పెరిగి రూ.1,325 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గడచిన 5 రోజుల్లో స్టాక్ ధర దాదాపు 3 శాతం మేర పెరిగింది.

Note: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునేందుకు వినియోగించకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+